మంత్రి నారా లోకేష్ పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. లోకేష్ కనీసం సర్పంచ్‌గా కూడా గెలవలేరని జోస్యం చెప్పారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాల్లో జనసేన పాతుకుపోయి వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని సీఎం చంద్రబాబు, లోకేష్ లు భయపడుతున్నారని పవన్‌ విమర్శించారు. 

ఏలూరు: మంత్రి నారా లోకేష్ పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. లోకేష్ కనీసం సర్పంచ్‌గా కూడా గెలవలేరని జోస్యం చెప్పారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాల్లో జనసేన పాతుకుపోయి వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని సీఎం చంద్రబాబు, లోకేష్ లు భయపడుతున్నారని పవన్‌ విమర్శించారు. 

ప్రాజెక్టుల నిర్వాసితులకు సరైన న్యాయం జరగడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే జగన్‌కు సంబంధించిన దోపిడీ వ్యవస్థ తీసుకురాబోమని స్పష్టం చేశారు. కౌలురైతులకు అండగా ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని పవన్ భరోసా ఇచ్చారు.

మరోవైపు విప్ పదవి నుంచి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని తొలగిస్తారా లేదా అని ప్రశ్నించారు. తొలగించని పక్షంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు లేఖ రాయమంటారా అని పవన్‌‌కల్యాణ్‌ నిలదీశారు.