Asianet News TeluguAsianet News Telugu

సీఎం కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవాడిని: పవన్ కళ్యాణ్

తాను సీఎం కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవాడినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో ప్రజాపోరాట యాత్రలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అన్యాయాన్ని ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానే తప్ప ముఖ్యమంత్రి కావాలన్న కోరికతో కాదన్నారు. 

pawan kalyan comments on cm post
Author
Devarapalli, First Published Oct 9, 2018, 9:31 PM IST

దేవరపల్లి: తాను సీఎం కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవాడినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో ప్రజాపోరాట యాత్రలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అన్యాయాన్ని ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానే తప్ప ముఖ్యమంత్రి కావాలన్న కోరికతో కాదన్నారు. వైసీపీ అధినేత జగన్‌లా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తాను కలలు కనడం లేదని విమర్శించారు. 

తనకు సీఎం పదవి కావాలంటే బీజేపీతో చేతులు కలిపి ఎప్పుడో అయ్యేవాడినని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జనసేనను వాళ్ల పార్టీలో కలపాలని అడిగారని తాను అలాంటి వాడిని కాదని సమాధానమిచ్చానని గుర్తు చేశారు. 2016లో ప్రత్యేకహోదా అంశంపై కేంద్రానికి గుర్తు చేసింది తానేనని పవన్ స్పష్టం చేశారు. 

తమ సమస్యలు పరిష్కరించండి అని కోరితే సీఎం అయితేనే చేస్తానని జగన్‌ అంటున్నారని, మళ్లీ సీఎం అయితే పరిష్కరిస్తానని చంద్రబాబు చెబుతున్నారని పవన్‌ విమర్శించారు. అరచేతితో సూర్యకాంతిని అడ్డుకోలేరని, జనసేన ఎదుగుదలను ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. 

రాజకీయ ప్రక్షాళన కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. కులం మతం, ప్రాంతాన్ని నమ్ముకుని పార్టీ పెట్టలేదన్నారు. తన దగ్గర టీవీ ఛానళ్లు, పత్రికలు లేవని అభిమానులే తన బలమన్నారు. ఆడపడుచుల గుండెచప్పుళ్లే తన వార్తా పత్రికలన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios