2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. జనసేనకు సీట్లు రావంటూనే మనతో పొత్తు కోసం కొందరు ప్రయత్నిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు.

జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న జనసేనాని ఇవాళ కృష్ణాజిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అంతటా జనసేన బలంగా ఉందని , అందుకే మనతో పొత్తు కోసం వేరే వారితో ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ వెల్లడించారు. 2014లో వ్యూహాత్మకంగానే తెలుగుదేశానికి మద్దతు ఇచ్చామని కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా దోపిడికీ పరిమితమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు.