ప్రేమికుడి ఆత్మహత్య.. పవన్ పైనే ఆశలు

First Published 11, Jul 2018, 11:07 AM IST
pawan fan sucide in vijayawada over love failure
Highlights

సూసైడ్ నోట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించాడు. ప్రేమ విఫలం కారణంగానే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ప్రేమ విఫలం చెందడంతో.. ఓ పవన్ కళ్యాణ్ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన విజయవాడ గవర్నర్ పేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన వంశీకృష్ణ..విజయవాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. 

మూడు రోజుల కిత్రం గవర్నరుపేట ఆలీబేగ్‌ వీధిలోని ఓ లాడ్జిలో దిగాడు. మంగళవారం మధ్యాహ్నం లాడ్జి సిబ్బందికి కనిపించాడు. రాత్రి 8 గంటల సమయంలో తలుపులు కొట్టినా తీయకపోవడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా గదిలో ఉరేసుకుని కనిపించాడు. సూసైడ్‌ నోట్‌ను బట్టి ప్రేమ వ్యవహరం వల్లే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వంశీకృష్ణ తన తల్లి, సోదరి ఫోన్‌ నంబర్లను లేఖలో పొందుపరిచాడు. తన గురించి ఆలోచించొద్దని పేర్కొన్నారు. తాను పవన్‌ కల్యాణ్‌ అభిమానినని.. ఆయన్ని ఒకసారి కూడా చూడలేదని.. వచ్చే ఎన్నికల్లో పవన్‌ గెలుపొందాలంటూ ఆకాంక్షించాడు. ప్రేమ విషయంలో తొందరపడొద్దంటూ యువతకు సూచిస్తున్నట్లుగా లేఖలో పేర్కొనడం గమనార్హం.  

loader