పవన్ అభిమానులు, జనసేన పార్టీ నేతలు మండిపడ్డారు. జగన్.. వెంటనే పవన్ కి క్షమాపణలు చెప్పాలంటూ పలువురు డిమాండ్ చేశారు కూడా. కాగా.. దీనిపై పవన్ గురువారం ఉదయం ఓ ట్వీట్ చేశారు.

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ తనపై చేసిన వ్యాఖ్యలపై పవన్ ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించారు. ‘‘పవన్.. కార్లను మార్చినంత సులభంగా భార్యలను మార్చుతారు’ అంటూ జగన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ కామెంట్లపై పవన్ అభిమానులు, జనసేన పార్టీ నేతలు మండిపడ్డారు. జగన్.. వెంటనే పవన్ కి క్షమాపణలు చెప్పాలంటూ పలువురు డిమాండ్ చేశారు కూడా. కాగా.. దీనిపై తన అభిమానులను ఉద్దేశిస్తూ పవన్ గురువారం ఉదయం ఓ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

‘‘ జగన్ మోహన్ రెడ్డిగా రు నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన తీరు చాలా మందికి బాధ కలిగించిందని నా దృష్టికి వచ్చింది. నేను ఎవరి వ్యక్తిగతమైన జీవితాల్లోకి వెళ్లను. అది రాజకీయ లబ్ది కోసం వాడను.ప్రజలకి సంబంధించిన పబ్లిక్ పాలసీల మీద మాత్రమే మిగితా పార్టీలతో విబేదిస్తాను కానీ.. నాకు ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేవు. ఈ తరుణంలో ఎవరన్నా జగన్ ని కానీ, వారి కి సంబంధించిన కుటుంబసభ్యులను కానీ, వారి ఇంటి ఆడపడుచుకులని కానీ ఈ వివాదంలోకి లాగవద్దని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.