జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి చంద్రబాబునాయుడుపై రెచ్చిపోయారు. సోమవారం వామపక్ష నేతలతో భేటీ అయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, అమరావతి టిడిపి రాజధానిలాగుందే కానీ ఏపి రాజధాని లాగ లేదంటూ ధ్వజమెత్తారు. కేంద్రంతో సమస్యలు వచ్చినపుడల్లా సర్దుకునిపోవటం వల్లే ఏపికి తీరని నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు.

అభివృద్ధి, ప్రజారోగ్యంపై ఖర్చు చేయాల్సిన నిధులను తన ఇష్టారాజ్యంగా  పుష్కరాల తదితారల కోసం ఖర్చు చేయటం వల్లే జనాలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను బిజెపి, టిడిపి పూర్తిగా గాలికొదిలేసినట్లు ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో సిపిఎం, సిపిఐ కార్యదర్శులు మధు, రామకృష్ణ కూడా పాల్గొన్నారు.