పవన్ జన్మదిన వేడుకల్లో బీజేపీ నేత.. ఏంటి కథ..?

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 3, Sep 2018, 11:01 AM IST
pawan birthday celebrations grandly celebrated by bjp MLA
Highlights

ఆ బీజేపీ ఎమ్మెల్యే జనసేనలోకి వెళ్తున్నారంటూ ప్రచారం..

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకులు తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 2వ తేదీన ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.  పవన్ సినీ అభిమానులు,. జనసేన కార్యకర్తలు ఈ వేడుకలు చేయడంలో ఓ అర్థం ఉంది. మరి ఓ బీజేపీ నేత పవన్ జన్మదిన వేడుకలు చేస్తే రాజకీయంగా ఆసక్తికరమే కదా.. ఇప్పుడు అదే జరిగింది. 

ఇంతకీ మ్యాటరేంటంటే...జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గణేష్‌ చౌక్‌లో సామాజిక కార్యకర్త పడాల శ్రీను ఆదివారం ఈ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే ఆకుల పేదలకు దుప్పట్లు, కార్యకర్తలకు మొక్కలు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ‘‘సినీ అభిమానం రాజకీయాలు, కులాలకు అతీతంగా సేవకు ప్రతిరూపం కావాలి. సమాజ సేవకు సంకల్పమే ముఖ్యం. డబ్బు కాదు’’ అన్నారు. జనసేన ముఖ్య నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, గంటా స్వరూప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఆకుల పార్టీ మారుతున్నారు’ అంటూ జరుగుతున్న ప్రచారం విషయాన్ని మీడియా ప్రశ్నించగా..  ఆయన స్పందిస్తూ, ‘‘గతంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలో కూడా పాల్గొన్నా. అయినా పార్టీ మారితే మీడియాను పిలిచి టిఫిన్‌ పెట్టి, కూల్‌డ్రింక్‌ ఇచ్చి చెప్తా’’ అంటూ నవ్వేశారు.

loader