కర్నూల్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో విద్యుత్ సరఫరాలో అంతరాయంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆసుపత్రిలోని జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు.
కర్నూల్:Kurnool జిల్లా ప్రభుత్వాసుపత్రిలో Electricity సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో Patients తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలోని జనరేటర్ కూడా పని చేయడం లేదు. దీంతో కార్డియాలజీ, న్యూరో సర్జరీ, సిటీ సర్జరీ, యురాలజీ, నెఫ్రాలజీ, వార్డుల్లో రోగులు అవస్థలు పడుతున్నారు.అలాగే ఎక్స్ రే, సిటీ స్కాన్ పరీక్షలకూ అంతరాయం ఏర్పడింది. దాదాపు మూడు గంటల పాటు ఉక్కపోతతో రోగులు, సహాయకులు ఇబ్బందులు పడ్డారు. 2019 జూలై లో కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
దీంతో ఐదు గంటల పాటు Surgeries వాయిదా వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని అప్పట్లో విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశాయి.కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి ప్రతి రోజూ సగటున రెండువేల మంది ఔట్ పేషేంట్లు, వెయ్యి మంది ఇన్ పేషేంట్లుగా వస్తుంటారు.
2017 జూలై మాసంలో కూడా కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. 2017 జూన్ 23న 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 20 మంది మరణించారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.
ఈ విషయమై అప్పట్లో విపక్షాలు ప్రభుత్వం తీరును తీవ్రంగా విమర్శించాయి. కర్నూల్ ఆసుపత్రిలోని పవర్ కంట్రోల్‌రూం వద్ద ఉదయం 10 గంటల సమయంలో ఫీజు పోయింది.
దీంతో బూత్‌బంగ్లా, సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. కేవలం ICU, ఓటీలకు మాత్రమే విద్యుత్ సరఫరా జరిగింది. అరగంట పాటు విద్యుత్ పోవడంతో మళ్లీ ఏదైనా సమస్య తలెత్తిందా అన్న ఆందోళన వైద్యులు, స్టాఫ్‌నర్సుల్లో నెలకొంది. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సమస్యను గుర్తించి.. పరిష్కరించారు. దీంతో వైద్యులు, రోగులు ఊపిరి పీల్చుకున్నారు.
