విశాఖ కేజీహెచ్‌లో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ డాక్టర్స్‌పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పోస్ట్ మార్టం విషయంలో మృతుని బంధువులు.. డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో 12 మంది డాక్టర్స్‌పై బ్లేడుతో దాడి చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డాక్టర్స్ ఆందోళనకు దిగారు.  సమాచారం అందుకున్న పోలీసులు.. ఆసుపత్రి వద్దకు చేరుకుని దాడి చేసిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read:మామిడి కాయలు కోసుకోవడానికి వెళ్తే.. మృత్యువు కబళించింది

అయితే మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని డాక్టర్స్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఏసీపీ శిరీషా మీడియాతో మాట్లాడుతూ దాడి చేసిన వారిలో ఎనిమిది మందిని గుర్తించామని, వారిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతామని చెప్పారు. కోవిడ్ క్లిష్ట పరిస్ధితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న వైద్యులపై దాడి చెయ్యడం సరికాదని ఏసీపీ అన్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.