కదులుతున్న రైల్లో నుంచి ఓ ప్రయాణికుడుని తోసేశారు తోటి ప్రయాణికులు. సీట్ల విషయంలో వచ్చిన గొడవలో సర్ది చెప్పాలనుకోవడమే కారణం అని సమాచారం. 

అనంతపురం : ఏపీలోని అనంతపురంలో దారుణ ఘటన వెలుగు చూసింది. పద్మావతి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడిని నడుస్తున్న రైల్లో నుంచి కిందికి తోసేశారు. అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దారుణ ఘటన జరిగింది. రైల్లో ఇద్దరు ప్రయాణికులకు మధ్య సీట్ల విషయంలో గొడవ జరుగుతుండగా.. రమేష్ అనే వ్యక్తి సర్ది చెప్పబోయాడు. దీంతో కోపానికి వచ్చిన వారు అతడిని రైల్లో నుంచి తోసేశారు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.