తెనాలి: గుంటూరు జిల్లా రేపల్లె ప్యాసెంజర్ రైలులో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంతో బోగీలకు విద్యుత్ ప్రవహించింది.

విద్యుత్ ప్రవాహంతో పలువులు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రయాణికులు విద్యుత్ షాక్ తో ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లారు. రైలు గుంటూరు నుంచి తెనాలి మీదుగా ఒంగోలు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

వేజెండ్ల రైల్వే స్టే,న్ లో ఆ ప్రమాదం జరిగింది. ప్రయాణికులు దిగుతుండగా కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు.