Asianet News TeluguAsianet News Telugu

పార్లమెంట్ లో పార్టీ కార్యాలయాలు కేటాయింపు: వైసీపీకి చోటు, టీడీపీకి నో ఛాన్స్

పార్లమెంటులోని గ్రౌండ్‌ ష్లోర్‌లోని అయిదవ నెంబర్‌ గదిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. గతంలో ఈ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. అయితే పార్లమెంట్ సభ్యుల సంఖ్య వైసీపీకి ఎక్కువగా ఉండటంతో ఆ గదిని వైసీపీకి కేటాయించారు

party offices allocated parliament in loksabha
Author
New Delhi, First Published Sep 26, 2019, 4:15 PM IST

న్యూఢిల్లీ : పార్లమెంట్ లోని పలు రాజకీయ పార్టీలకు పార్టీ కార్యాలయాలను కేటయించారు అధికారులు. దేశవ్యాప్తంగా 15 పార్టీలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో గదులను కేటాయించారు. ఈమేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. 

పార్లమెంటులోని గ్రౌండ్‌ ష్లోర్‌లోని అయిదవ నెంబర్‌ గదిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. గతంలో ఈ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. అయితే పార్లమెంట్ సభ్యుల సంఖ్య వైసీపీకి ఎక్కువగా ఉండటంతో ఆ గదిని వైసీపీకి కేటాయించారు.

పార్టీకి ఐదుగురు ఎంపీల కంటే ఎక్కవ ఉంటేనే పార్టీ కార్యాలయాలు కేటాయించింది లోక్ సభ కార్యాలయం.  అయితే తెలుగుదేశం పార్టీకి ఎలాంటి గదిని కేటాయించలేదు. ఐదుగురు ఎంపీలు కంటే తక్కువ మంది గెలిచిన నేపథ్యంలో పార్టీ కార్యాలయాన్ని కేటాయించలేదు. గతంలో కేటాయించిన కార్యాలయాన్ని వైసీపీకి కేటాయించారు అధికారులు. 

గ్రౌండ్ ఫ్లోర్ లోని 2,3,4 గదులను భారతీయ జనతాపార్టీకి కేటాయించారు. కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ ఫ్లోర్ లోని 24,25 గదులను కేటాయించారు. ఇకపోతే డీఎంకే పార్టీకి గ్రౌండ్ ఫ్లోర్ లోని 46వ గతిని కేటాయించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ ఫ్లోర్ లోని 20 బీ గదిని కేటాయించారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ ఫ్లోర్ లోని ఐదవ గదిని కేటాయించారు. అలాగే శివసేన పార్టీకి థర్డ్ ఫ్లోర్ లోని 128వ గదిని, జనతాదళ్ పార్టీకి థర్డ్ ఫ్లోర్ లోని 126వ గదిని కేటాయించారు. బిజూ జనతాదళ్ పార్టీకి గ్రౌండ్ ఫ్లోర్ లోని 45వ గదిని, బహుజన సమాజ్ వాద్ పార్టీకి థర్డ్ ఫ్లోర్ లోని 128 ఏ గదిని కేటాయించారు. 

టీఆర్ఎస్ పార్టీకి థర్డ్ ఫ్లోర్ లోని 125వ గదిని, సమాజ్ వాది పార్టీకి థర్డ్ ఫ్లోర్ లోని 130వ గదిని, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి థర్డ్ ఫ్లోర్ లోని 126వ గదిని కేటాయించారు. ఇకపోతే వామపక్ష పార్టీకి థర్డ్ ఫ్లోర్ లోని 118 గదిని, ఏఐఏడీఎంకే పార్టీకి గ్రౌండ్ ఫ్లోర్ లోని 45వ గదిని కేటాయించారు లోక్ సభ అధికారులు. 

party offices allocated parliament in loksabha
 

Follow Us:
Download App:
  • android
  • ios