రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి పరిటాల సునీత, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టారు.

బుధవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంటికి చేరుకున్న మహిళా నేతలు ఆయనకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపి, రక్షాబంధన్ కట్టారు. అనంతరం బాబు వద్ద ఆశీస్సులు తీసుకున్నారు.

చేతి నొప్పితో బాధపడుతున్న చంద్రబాబు నాయుడు మంగళవారం గుంటూరులో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి చేతికి కట్టుతోనే హాజరయ్యారు. వైద్యులు రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆయన మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు.