పరిటాల సునీత మాట్లాడుతూ దేవినేని ఉమా మహేశ్వరరావును పరామర్శించడానికి వచ్చానని, శ్రావణ మంగళవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నానని తెలిపారు. 

విజయవాడ : బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెను ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అమ్మవారిని దర్శించుకుని పరిటాల సునీత ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు తీర్థ ప్రసాదాలతోపాటు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం పరిటాల సునీత మాట్లాడుతూ దేవినేని ఉమా మహేశ్వరరావును పరామర్శించడానికి వచ్చానని, శ్రావణ మంగళవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నానని తెలిపారు. 

రైతులు బాగుండాలని కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నానని సునీత తెలిపారు.