టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించారు మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్. కొత్త సమస్యలు సృష్టించి పాత సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని.. అనంతపురం జిల్లా రావణకాష్టాన్ని  తలపిస్తోందని శ్రీరామ్ అన్నారు.

ఓ ఎమ్మెల్యే మరో మాజీ ఎమ్మెల్యేపై దాడి చేస్తున్నారంటే.. పరిస్థితి ఎలా వుందో ఊహించాలని ఆయన సూచించారు. స్నేహలత హత్యపై దృష్టి మరల్చాలని చూస్తున్నారని పరిటాల ఆరోపించారు.

Also Read:తాడిపత్రిలో రాళ్లదాడి: 22 మందిపై కేసులు.. జేసీ, కేతిరెడ్డి ఇళ్ల వద్ద భారీ భద్రత

ఇలాంటి ఘటనలు జరిగితే తెలుగుదేశమే గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కాగా,  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఆగ్రహంతో నేరుగా జేసీ ఇంటికి వెళ్లారు.

తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జేసీ అనుచరులపై మండిపడ్డారు. అక్కడే ఉన్న ఇద్దరు యువకులపై దాడి చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్ రెడ్డి కుర్చీలో కూర్చోగా, ఆయన లేచిన వెంటనే జేసీ అనుచరులు ఆ కుర్చీని తగలబెట్టారు. ఆ కాసేపటికే జేసీ, కేతిరెడ్డి వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్న సంగతి తెలిసిందే.