శ్రీసత్యసాయి జిల్లాలో ఐదుగురు సజీవ దహనం: తాడిమర్రి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద పరిటాల శ్రీరామ్ ఆందోళన
శ్రీ సత్యసాయి జిల్లాలో హై టెన్షన్ విద్యుత్ వైర్ ఆటోపై పడి ఐదుగురు సజీవ దహనమైన ఘటనపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు ఇవ్వాలని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి రూ. 20 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరారు.
కర్నూల్:శ్రీసత్యసాయి జిల్లాలో హైటెన్షన్ విద్యుత్ వైర్ ఆటోపై పడి ఐదుగురు సజీవదహనమైన ఘటనపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. Tadimarri విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద టీడీపీ నేత Paritala Sriram ఆధ్వర్యంలో TDP నేతలు ఆందోళనకు దిగారు. Auto పై హైటెన్షన్ విద్యుత్ వైర్ పడింది. ఈ విషయమై అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా సరిగా స్పందించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ సమయంలో విద్యుత్ సబ్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నవారిని సస్పెండ్ చేయాలని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ డిమాండ్ చేశారు. అదే విధంగా విద్యుత్ వైర్ తగిలి ఆటోలో సజీవ దహనమైన ఐదుగురు మహిళా కూలీల కుటుంబాలకు రూ. 50 లక్షలు చెల్లించాలని పరిటాల శ్రీరామ్ డిమాండ్ చేశారు.
also read:శ్రీసత్యసాయి జిల్లాలో ఐదుగురు సజీవ దహనం: విద్యుత్ వైర్ తెగడానికి ఉడుతే కారణమా?
మరో వైపు మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 20 లక్షలు చెల్లించాలని టీడీపీ నేత డిమాండ్ చేశారు. ఉడుత వెళ్తే విద్యుత్ వైర్ తెగిందంటే ఎంత నాసిరకమైన విద్యుత్ వైర్ ను ఉపయోగించారో అర్ధమౌతుందన్నారు. తెగిపడిన విద్యుత్ వైర్ ఆటోపై పడిన సమయంలో స్థానికులు విద్యుత్ శాఖాధికారులకు సమాచారం ఇచ్చినా కూడా విద్యుత్ సరఫరాను నిలిపివేయలేదన్నారు. దాదాపుగా 10 నిమిషాలకు పైగా విద్యుత్ సరపరా కొనసాగడంతో ఐదుగురు ఆటోలోనే సజీవ దహనమయ్యారని ఆయన ఆరోపించారు.