Asianet News TeluguAsianet News Telugu

శ్రీసత్యసాయి జిల్లాలో ఐదుగురు సజీవ దహనం: విద్యుత్ వైర్ తెగడానికి ఉడుతే కారణమా?

శ్రీసత్యసాయి హిందూపురం జిల్లాలో ఆటో రిక్షాపై హెటైన్షన్ విద్యుత్ వైర్ తెగడానికి ఉడుత కారణమని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. బలహీనంగా ఉన్న వైరుపై ఉడుత వెళ్లడంతో ఈ పరిస్థితి  నెలకొందని విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు.

APCPDCL officers Suspects Squirrel Beaking Electiricy wire In Sri Sathya Sai district
Author
Guntur, First Published Jun 30, 2022, 11:29 AM IST

అనంతపురం: Sri Sathya Sai district హిందూపురం జిల్లాలో  Auto Richshhaw పై హైటెన్షన్ విద్యుత్ వైర్ తెగడానికి Squirrel కారణమనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ శాఖాధికారులు.

జిల్లాలో తాడిపర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద  ఆటోపై హైటెన్షన్ Electricity వైర్  తెగిపడి ఐదుగురు కూలీలు గురువారం నాడు  సజీవ దహనమయ్యారు. విద్యుత్ Pole కు, ట్రాన్స్ పార్మర్ మధ్య ఉేన్న వైర్ తెగిపోవడానికి సిద్దంగా ఉంది.  ఈ విషయాన్ని విద్యుత్ శాఖాధికారులు గుర్తించి మరమత్తు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. విద్యుత్ వైర్ తెగిపోవడానికి సిద్దంగా ఉండి నిప్పురవ్వలు వెలువడుతున్నాయి.

ఈ సమయంలో ఇదే వైరుపై ఉడుత వెళ్లడంతో ఆ బరువుకు బలహీనంగా వైర్ తెగిపడిందని విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు. అదే సమయంలో ఆటో అదే మార్గంలో ఆటో ప్రయాణీస్తుంది. తెగిపడిన వైర్ ఆటోపై పడడంతో అప్పటికే మంటలు వ్యాపించాయని విద్యుత్ శాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు. వైర్ తెగిపడిన సమయంలోనే ఉడత కూడా మరణించింది. విద్యుత్ పోల్ కు సమీపంలోనే ఉడుత మరణించింది.

also read:శ్రీసత్యసాయి జిల్లాలో ఐదుగురు సజీవ దహనం: విచారణకు ఏపీసీపీడీసీఎల్ ఆదేశం

ఆటోపై ఉన్న ఇనుప రాడ్ కు విద్యుత్ వైర్ తగిలింది. ఈ వైర్ తో సహా ఆటో కొద్దిదూరం ప్రయాణించింది.ఈ సమయంలలో మంటలు వ్యాపించాయి. ఆటోలోని మహిళా కూలీలు ఆటో నుండి కిందకు దిగలేకపోయారు. ఆటో నుండి దిగిన కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. ఐదుగురు ఆటోలోనే సజీవ దహనమయ్యారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్ తో పాటు 12 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు ఆటోలోనే సజీవ దహనమయ్యారు. ఈ ఆటో నుండి ఆరుగురు బయట పడ్డారు. మృతులు గుడ్డంపల్లి, పెద్దకోట్లగ్రామస్తులు.  మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులను కాంతమ్మ, రాములమ్మ, రత్నమ్మ, లక్ష్మీదేవి, కుమారిగా గుర్తించారు. సజీవ దహనం కావడంతో మృతదేహలు పూర్తిగా దగ్దమయ్యాయి. మృతదేహలను పోస్టుమార్గం నిమిత్తం ధర్మవరం ఆసుపత్రికి తరలించారు.

విద్యుత్ వైర్ తెగిపోయే పరిస్థితి ఉండి నిప్పు రవ్వలు వస్తున్నాయని స్థానికులు మీడియాకు చెప్పారు. నాసిరకం విద్యుత్ వైర్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఈ ప్రమాదంపై విచారణకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ విచారణకు ఆదేశించారు. 

అధికారుల నివేదిక ఆధారంగా  ఏపీసీపీడీసీఎల్ అధికారులు చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా విద్యుత్ శాఖాధికారులు చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. 

ఆటోలో groundnut చేనులో కూలీ పనికి మహిళా కూలీలు వెళ్తున్నారు. ప్రతి రోజూ కూలీ పని చేస్తేనే వీరికి ఉపాధి లబిస్తుంది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి తమదని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios