Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ ఎమ్మెల్యే బండారం బయటపెట్టిన పరిటాల శ్రీరామ్

వైసీపీ ఎమ్మెల్యే రాప్తాడు ప్రకాష్ రెడ్డి, అత‌ని సోదరులపై పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త‌మ కుటుంబంపై  ఆస‌త్య ప్ర‌చారం మానుకోవాల‌ని, త‌నవి అక్రమాలని నిరూపిస్తే..త‌న ఆస్తిని దానమిస్తాన‌ని ప్ర‌క‌టించారు. కేవ‌లం రెండ్లేళ్ల వ్య‌వ‌ధిలోనే ఎమ్మెల్యే ప్రకాష్ర రెడ్డితో పాటు ఆయన సోదరుల పేరు మీద ఎన్నో ఆస్తులున్నాయని పరిటాల శ్రీరామ్‌ ఆరోపించారు. 

paritala shriram was highly critical of mla prakash reddy
Author
Hyderabad, First Published Jan 13, 2022, 8:15 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులపై పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. త‌మ కుటుంబంపై  ఆస‌త్య ప్ర‌చారం చేయొద్ద‌ని. తాము అక్రమాలు చేస్తే నిరూపించాలని స‌వాలు విరిరారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి దారుణాల‌కు పాల్ప‌డుతున్న‌డని .. గెలుపొందిన మూడేండ్ల‌లో కొట్లాది రూపాయాల ఆస్తి ఎక్కడ నుంచి వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు. ఎమ్మెల్యే ప్రకాష్ర రెడ్డితో పాటు ఆయన సోదరుల పేరు మీద ఎన్నో ఆస్తులున్నాయని పరిటాల శ్రీరామ్‌ ఆరోపించారు. కాంట్రాక్టర్ పరమేశ్వర్ రెడ్డి ఎవరు.. నీ బినామీ కాదా..? అంటూ ప్రశ్నించారు. 

ముందుగా త‌మ కుటుంబంపై ఆస‌త్య ప్ర‌చారాలు మానుకోవాల‌ని సూచించారు. పరిటాల రవికి రాజకీయాల్లో రాక‌ముందే .. వ్యాపారాలు ఉన్నాయి. ఆయ‌న 25 సంవత్స‌రాల క్రిత‌మే మైనింగ్ ప్రారంభించార‌ని. ఆయ‌న ఆరోజుల్లోనే విమానాల్లో తిరిగే వార‌ని అన్నారు. అప్పుడే కోట్ల రూపాయాలతో వ్యాపారాలు చేశారని అన్నారు. చాలా ఇబ్బందుల తర్వాత మేము కోలుకుని ఆస్తులు సంపాదించామని, తమ‌కు క‌లిగిన దానిలో కొంత దాన‌ధ‌ర్మాలు చేశామ‌ని  శ్రీరామ్‌ అన్నారు. తాము సంపాదించిన ప్ర‌తి రూపాయి..  ప్రభుత్వ నిబంధనల ప్రకారమేన‌నీ, ప్ర‌తి రూపాయికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కడుతున్నామన్నారు. త‌మ ఆస్తులు ఎక్క‌డెక్క‌డ ఉన్నాయో.. తెలుసుకోవాలంటే..  త‌న క్లార్క్ కు ఒక లెటర్‌ రాస్తే చాలు.. పూర్తి వివరాలు అందిస్తాడ‌ని ప్రకాష్‌ రెడ్డి సోదరులకు చురకలు అంటించారు. త‌న మామ కమ్యూనిస్టు  నేత కృష్ణారావు పేరు మీద ఎయిర్‌పోర్టు వద్ద 200 ఎకరాలు ఉన్న‌య‌ని అంటున్నారు. అది నిరూపిస్తే.. ఆ 200 ల ఎకరాలను ఆర్డీటీ సంస్థకు రాసి ఇస్తాన‌ని స‌వాలు విరిరారు.

 పరిటాల రవిని చంపితే.. ఆస్తులు రాలేదని.. మీరు ఇప్పటికీ మర్డర్ కేసుల్లో ఉన్నార‌ని గుర్తు చేశారు. ఎమ్మెల్యే పెద్ద సోదరుడు కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో ఎలా వసూళ్లకు పాల్పడుతున్నారో అంద‌రికీ తెలుసునని శ్రీరామ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  తోపుదుర్తి డెయిరీ ద్వారా అక్ర‌మాలు చేశారని, ఈ డెయిరీ లో  50 లక్షలు ఎవరి అకౌంట్‌కు మళ్లించార‌ని ప్ర‌శ్నించారు. మిషనరీ కొనడానికి రెండేళ్లు సమయం పడుతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడ్ల పల్లి ప్రాంతంలో 2వేల ఎకరాల‌ను ఆక్ర‌మించడానికి ప్ర‌య‌త్నించర‌ని ఆరోపించారు. అలాగే.. భూదందాలు చేస్తున్నార‌నీ, లే అవుట్ పేర్ల‌తో స‌వాళ్లకు పాల్ప‌డుతున్నార‌ని అన్నారు. 5కోట్ల డబ్బుతో హైదరాబాద్ గోదా టవర్స్‌లో ప్లాట్‌ కొన్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ప్ర‌శ్నించారు. 

చమన్ త‌న చిన్నాన్న లాంటి వారనీ, ఆయన మృతి వెనుక ఏముందే తేల్చు కోవాల‌ని ప్రకాష్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. తాను జగన్‌లాగా.. సొంత చిన్నాన్నని చంపుకునేందుకు.. అధికారం ఉంది. కదా నిరూపించుకో.. సీఎంకు రాయాల్సింది త‌న‌కు కాదనీ. నియోజకవర్గ సమస్యల మీద అంటూ చురకలు అంటించారు. నియోజకవర్గంలో ఐదుగురు ఎమ్మెల్యేలు సామంత రాజుల్లా వ్య‌వ‌హ‌రిస్తోన్నర‌ని   ఆరోపణలు చేశారు. సీఎం దగ్గర మీ చిట్టా ఉంది.. త‌న‌ని మించి చేస్తున్నారని జగన్ ఆశ్చర్యపోతున్నారు. నిన్ను నీ సోదరులే చంపేందుకు చూస్తున్నారని ప్రచారం జరగుతుందంటూ పరిటాల శ్రీరామ్‌ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios