Asianet News TeluguAsianet News Telugu

దారుణం : విడిపోయేందుకు అడ్డుగా ఉన్నాడని బిడ్డ అమ్మకానికి.. తల్లీ,తండ్రి,తాత అరెస్ట్...

ఏలూరులో ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఓ జంట.. బాబు పుట్టాక విడిపోవాలనుకున్నారు. దీనికోసం అడ్డుగా ఉన్న నాలుగు నెలల చిన్నారిని అమ్మడానికి పథకం వేశారు. 

parents trying to sell 4 month baby over they are separating due to disputes, arrested in eluru
Author
First Published Oct 14, 2022, 8:06 AM IST

ద్వారకా తిరుమల : వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు. 15 నెలల్లోనే వారి మధ్య మనస్పర్థలు తలెత్తడంతొ విడిపోవాలి అనుకున్నారు. ఇందుకు తమ నాలుగు నెలల వయస్సు గల మగబిడ్డ అడ్డుగా ఉన్నాడనిపించింది. దీంతో దారుణమైన ఆలోచన చేశారు. నవమాసాలు మోసి, పురుటినొప్పులు పడి కన్న బిడ్డమీద ఆ తల్లికి మమకారం లేకపోయింది. తమ ప్రేమకు ప్రతిరూపంగా జన్మించిన ఆ నాలుగు నెలల పసిగుడ్డు వారిద్దరికీ డబ్బుల మూటలా కనిపించాడు. అందుకే.. తమ భవిష్యత్ జీవితాలకు అడ్డుగా ఉన్న ఆ చిన్నారిని అమ్మేసి,  వచ్చిన సొమ్మును  ఇద్దరూ పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. 

వింటుంటేనే షాకింగ్ గా అనిపిస్తున్న ఈ ఘటన ఏలూరు జిల్లా  ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కొండ పై  గురువారం చోటు చేసుకుంది. బిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రులు, తాత పోలీసులకు చిక్కడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సభ్యసమాజం ఒక్కసారిగా షాక్ కు గురయ్యే ఈ ఘటనలో వివరాల్లోకి వెడితే... కాకినాడకు చెందిన కేశినేని వసంత (20)కి  తల్లిదండ్రులు లేరు. ఆమె రాజమండ్రిలో బైక్ షోరూంలో పనిచేస్తుంది. ఆమెకు రాజమండ్రిలోనే ఒక ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న రారాజు(25)తో  పరిచయం ఏర్పడింది.  

విజయవాడలో దారుణం : తల్లిదండ్రులు లేని మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. గర్భం దాల్చడంతో...

అది ప్రేమగా మారడంతో వివాహం చేసుకున్నారు.ఇటీవల భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవలు పడుతున్నారు. దీంతో వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఈ క్రమంలో బిడ్డను ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చింది. మామూలుగా అయితే తండ్రి దగ్గరో, తల్లి దగ్గరో ఉంచుకుంటారు. కానీ వీరిద్దరికి ఆ బిడ్డ భారంగా కనిపించాడు. ఇంటరిగా మొదలుపెట్టబోయే ప్రయాణంలో బాబును వదిలించుకోవాలనుకున్నారు. అలాగని అనాధాశ్రమంలో  వదిలిపెట్టాలి అనుకోలేదు. ఎవరికైనా దత్తతకు ఇవ్వాలని కూడా అనుకోలేదు. మగ బిడ్డ కాబట్టి  అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని చూశారు.  

అలా తమకు అడ్డుగా ఉన్న బిడ్డను అమ్మేసి,  వచ్చిన డబ్బును  ఇద్దరూ పంచుకోవాలని భావించారు. ఈ మేరకు కుమారుడుని తీసుకుని రారాజు, వసంత, రారాజు తండ్రి ప్రసాద్ 25 రోజుల కిందట ద్వారకా తిరుమలకు చేరుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ ఒక వ్యక్తి ద్వారా భీమవరానికి చెందిన వృద్ధుడికి బాబును అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో పిల్లాడి కోసం కొండపైన శ్రీనివాస నిలయం కాటేజీ ప్రాంతానికి చేరుకున్న వృద్ధుడిని రూ. 10 లక్షలు ఇవ్వాలని ప్రసాద్ డిమాండ్ చేశాడు. అయితే తాను డబ్బులు ఇవ్వని..  బాబును జాగ్రత్తగా పెంచుకుంటానని ఆ వృద్ధుడు చెప్పుకొచ్చాడు.  

దీనికి ప్రసాద్ ససేమిరా అనడంతో..  బాబు తండ్రి రారాజు కల్పించుకుని..  కనీసం రూ. రెండు లక్షలు ఇస్తే బాబును ఇస్తానని చెప్పాడు. దీంతో రారాజు, అతని తండ్రికి మధ్య  గొడవ జరిగింది. ఈ వ్యవహారం అంతా చుట్టుపక్కల భక్తులు గమనించారు.  దీంతో వారు తండ్రీకొడుకుల వద్దకు చేరుకుని అసలు ఏం జరుగుతుంది అంటూ నిలదీశారు. దీంతో బాలుడు కోసం వచ్చిన వృద్ధుడు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బిడ్డతో పాటు  రారాజు, వసంత, ప్రసాద్ లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios