అమరావతి : ఉండవల్లిలోని ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత పంచుమర్తి అనురాధ. ప్రతిపక్ష నేత విదేశాల్లో ఉన్న సయయంలో ప్రజావేదికను స్వాధీనం చేసుకోవడం అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పాలిటిక్స్ కు నిదర్శనమన్నారు.  

కరకట్ట ప్రాంతంలో ఉన్నవన్నీ అక్రమ కట్టడాలే అంటూ పదేపదే ఆరోపణలు చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజావేదికను ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ నిలదీశారు. ఇదంతా తమను ఇబ్బంది పెట్టడంలో భాగమేనంటూ ఆమె విరుచుకుపడ్డారు. 

మరోవైపు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ టీడీపీ రాజ్యసభ సభ్యులపై మండిపడ్డారు. పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్ ఉండగా, పార్టీ మారిన రాజ్యసభ సభ్యులు టీడీపీ లెటర్ హెడ్ తో లేఖను ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. 

ఒక పార్టీని మరోపార్టీలో విలీనం చేసే ప్రక్రియ అంతా ఈసీ పరిధిలో ఉంటుందన్నారు. అలాంటిది టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీ రాజ్యసభ సభ్యులుగా ఎలా చూపిస్తారంటూ ప్రశ్నించారు పంచుమర్తి అనురాధ.  

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబుకు షాక్: ప్రజావేదికను స్వాధీనం చేసుకున్న జగన్ సర్కార్