Asianet News TeluguAsianet News Telugu

మున్సిపాలిటీల్లో పంచాయతీల విలీనం: విచారణ జూన్‌కు వాయిదా వేసిన ఏపీ హైకోర్ట్

ఏపీలోని పలు మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీల విలీనాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే

panchayats merging in municipalities case updates in andhra pradesh ksp
Author
Amaravathi, First Published Apr 20, 2021, 4:20 PM IST

ఏపీలోని పలు మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీల విలీనాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే.  

పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్ బెంచ్ విచారణ జరిపింది. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని కోర్టుకు తెలిపారు అడ్వోకేట్ జనరల్. తదుపరి విచారణను జూన్ 3వ వారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. 

Also Read:సీఎం సొంత జిల్లాలో... గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

గత ఏడాది స్థానిక ఎన్నికల ప్రక్రియలోనే ఈ గ్రామాలను మునిసిపాలిటీలలో కలుపుతూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీనిపై కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టు స్టే ఇవ్వటంతో గ్రామాలు విలీనం నిలిచి పోయింది. అయితే తాజాగా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను విడుదల చేసింది. దీంతో ఈ గ్రామాల పరిధిలోని లక్షలమంది ఓటర్లు అర్బన్‌ పరిధిలోకి వస్తారు
 

Follow Us:
Download App:
  • android
  • ios