Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ 19 : కూర్చున్న కుర్చీలోనే కన్ను మూశాడు.. !

కరోనా మహమ్మారి ఎప్పుడు ఎవరిని ఎలా బలి తీసుకుంటుందో తెలియడంలేదు. ఒక్కసారిగా ఊపిరి అందక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య భయాందోళనలు కలిగిస్తోంది. తాజాగా విధినిర్వహణలో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి పంచాయతీ కార్యాలయంలో తను కూర్చున్న కుర్చీలోనే తుది శ్వాస విడిచాడు.

panchayat secretary died due to corona in grama panchayat office at east godavari - bsb
Author
Hyderabad, First Published May 1, 2021, 12:10 PM IST

కరోనా మహమ్మారి ఎప్పుడు ఎవరిని ఎలా బలి తీసుకుంటుందో తెలియడంలేదు. ఒక్కసారిగా ఊపిరి అందక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య భయాందోళనలు కలిగిస్తోంది. తాజాగా విధినిర్వహణలో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి పంచాయతీ కార్యాలయంలో తను కూర్చున్న కుర్చీలోనే తుది శ్వాస విడిచాడు.

ఈ హృదయ విదారక ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని గండేపల్లి మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామ కార్యదర్శి గా జయశంకర్ నారాయణ విధులు నిర్వహిస్తున్నారు. గత నాలుగు రోజులుగా జయశంకర్ జ్వరంతో బాధపడుతున్నారు.

ఇంతలోనే శుక్రవారం ఆఫీసులో కూర్చున్న కుర్చీలోనే తుది శ్వాస విడిచాడు. అయితే అతను కరోనా లక్షణాలతో బాధపడుతూ మృతి చెంది ఉంటాడని భావించిన సిబ్బంది ఎవరూ ఆయన దగ్గరకు వెళ్లే సాహసం చేయలేదు. కాగా విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

విషాదం : ఆస్పత్రిలో బెడ్ దొరకక.. కారులోనే తుదిశ్వాస విడిచిన మహిళ......

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

Follow Us:
Download App:
  • android
  • ios