ఆంధ్ర ప్రదేశ్ లోని ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో పామర్రు ఒకటి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కైలే అనిల్ కుమార్ వున్నారు. ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుతర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పామర్రు గడ్డపై వైసిపి జెండా ఎగిరింది. దీంతో ఈసారి కూడా పామర్రులో గెలుపుపై వైసిపి ధీమాతో వుంటే టిడిపి కూడా గెలుపుకోసం వ్యూహాలు రచించింది. ఇలా వైసిపి, టిడిపి పామర్రు గెలుపుకోసం పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతుండటంతో ఇక్కడ రిజల్ట్ ను అంచనావేయడం రాజకీయ పండితులకు కూడా సాధ్యం కావడంలేదు. 

పామర్రు రాజకీయాలు : 

పామర్రు నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకున్నాయి. టిడిపి నాయకురాలు ఉప్పులేటి కల్పన సుధీర్ఘకాలం టిడిపిలో వుంటూ 2004,2009 అసెంబ్లీ ఎన్నికల్లో పామర్రు నుండి పోటీచేసారు... ఈ రెండుసార్లు ఆమె ఓటమిపాలయ్యారు. కానీ 2012 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పామర్రు నుండి పోటీచేసి విజయం సాధించారు. కానీ 2016లో వైసిపికి రాజీనామా చేసి తిరిగి టిడిపిలో చేరారు. 2019 ఎన్నికల్లో టిడిపి నుండి పోటీచేసి వైసిపి అభ్యర్థి కైలే అనిల్ కుమార్ చేతిలో ఓటమిని చవిచూసారు. ఈ ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా తటస్థంగా వున్నారు ఉప్పులేటి కల్పన. దీంతో ఆమెకు ఈసారి టిడిపి టికెట్ దక్కలేదు. 

ఇక వైసిపిలో కూడా ఇలాంటి పరిస్థితే వుంది... సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని పామర్రు వైసిపి శ్రేణులే వ్యతిరేకిస్తున్నారు. కానీ 
వైసిపి అధినేత మాత్రం అనిల్ నే మరోసారి బరిలోకి నిలిపేందుకు సిద్దమయ్యారు... ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. 


పామర్రు నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. తోట్లవల్లూరు
2. పమిడిముక్కల 
3. మొవ్వ 
4.పెరపారుపూడి 
5. పామర్రు

పామర్రు అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌- 1,80,913

పురుషులు - 88707
మహిళలు ‌- 92,199

పామర్రు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ కు మరోసారి అవకాశం దక్కేలా వుంది. ఇప్పటికే వెలువడిన వైసిపి అభ్యర్థుల జాబితాలో అనిల్ పేరు లేదు... కానీ పామర్రు నుండి తిరిగి అనిల్ బరిలోకి దిగుతారని స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. 

టిడిపి అభ్యర్థి :

టిడిపి సీనియర్ నాయకుడు వర్ల రామయ్య తనయుడు వర్ల కుమార రాజను పామర్రు బరిలో నిలిపారు. 


పామర్రు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

పామర్రు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

వైసిపి - కైలే అనిల్ కుమార్ - 88,547 (57 శాతం) - 30,873 ఓట్లతేడాతో ఘనవిజయం 

టిడిపి - ఉప్పులేటి కల్పన - 57,674 - ఓటమి 

జనసేన పార్టీ - 5,574 - ఓటమి 

పామర్రు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,51,759 

వైసిపి - ఉప్పులేటి కల్పన - 69,546 (45 శాతం) - 1,069 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం 

టిడిపి - అరుదుగా రామయ్య - 68,477 (45 శాతం) - ఓటమి