రూ.750కోట్లంటూ ప్రచారం... నిరూపిస్తే రాజకీయ సన్యాసం: పల్లా శ్రీనివాసరావు సవాల్ (వీడియో)

తనకు రూ.750 కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయని తప్పుడు ప్రచారం జరుగుతోందని విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. 

palla srinivas rao challange to ycp leader akp

విశాఖపట్నం: తనపై సోషల్ మీడియాతో పాటు ఇతర మాద్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. తనకు రూ.750 కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని అన్నారు. 49 ఎకరాలు తన ఆధీనంలో ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పల్లా సవాల్ విసిరారు. 

మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యుఎల్‌సీ భూములను ఆక్రమించారని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించిన విషయం తెలిసిందే.  ఈ భూముల విలువ వందల కోట్లు ఉంటుందని... 48 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవాళ స్వాధీనం చేసుకొన్నట్టుగా మంత్రి తెలిపారు. ఈ ఆరోపణలపైనే తాజాగా పల్లా స్పందించారు.

''సర్వే నెంబర్ 14 లో చెరువుకు అనుకుని ఉన్న నా స్థలంలో ఫెన్సింగ్ తో ఉన్న రెండు అడుగులు ప్రదేశాన్ని కొట్టారు. సర్వే నెంబర్ లో 33/2 లో నా వద్ద ఆస్తులు ఏమైనా తొలిగించారా..? 2014, 2019 లో ఎన్నికలో అఫిడవిట్ లో కూడా నా ఆస్తులు పొందు పరిచాను'' అని పల్లా తెలిపారు.

వీడియో 

''విశాఖలో రెండు జగ్గరాజు పేటలు ఉన్నాయి. ఒకటి కాపు జగ్గరాజు పేట కాగా రెండవది యాదవ జగ్గరాజు పేట. నాకు యాదవ జగ్గరాజు పేటలో స్థలం ఉంది తప్ప కాపు జగ్గరాజుపేటలో లేదు. ఎక్కడో స్థలాన్ని కొట్టి అది నా స్థలం అంటున్నారు. పార్టీ మారలేదనే కక్షతోనే ఇలా చేసారు'' అని వెల్లడించారు. 

''స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఉద్యమం చేసాననే అక్కసుతోనే వేధిస్తున్నారు. నేను, మా కుటుంబం 9సార్లు ఎన్నికల్లో పోటీచేసాం. డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాలలోకి రాలేదు. నా పిల్లల లాగే సమాజం కూడా ఉండాలని కోరుకుంటున్నాను'' అన్నారు. 

''ప్రశాంత్ కిశోర్ వ్యూహాన్ని విజయసాయి రెడ్డి అమలు చేస్తున్నారు. నిన్న నాపై మాట్లాడిన మంత్రి, శాసన సభ్యులు, వైసీపీ నాయకులు చర్చ కు రండి. నేను అన్యాక్రాంతం చేసాను అని నిరూపించండి'' అని పల్లా సవాల్ విసిరారు. 

''నేను టిడిపిలో ఉంటాను టిడిపి లోనే చస్తాను, పార్టీ మారే ప్రసక్తి లేదు అని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని పల్లా తెలిపారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios