శ్రీకాకుళం: శ్రీకాకుళ: జిల్లా సోంపేట మండలంలోని పల్లివీధిలో కుళాయి వద్ద జరిగిన ఘర్షణలో పద్మ అనే మహిళ మృతి చెందారు. ఈ ఘటన సోమవారం నాడు ఉదయం చోటు చేసుకొంది.

తాటిపూడి పద్మ మంచినీటిని పట్టుకొనేందుకు కుళాయి వద్ద క్యూలో నిల్చుంది.  నీటిని పట్టుకొనే విషయంలో  మహిళలు పోటీలు పడ్డారు. క్యూ తప్పింది. దీంతో  మహిళల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.  దీంతో మహిళలు బిందెలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకొన్నారు.

ఈ ఘటనలో పద్మ గుండె, తల భాగంలో తీవ్ర గాయాలైనట్టుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు.  ఈ  గాయాలతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయమై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.