పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మావోల వార్నింగ్: భద్రత పెంపు
విశాఖలోని పాడేరులో బాక్సైట్ మైనింగ్ నిలిపి వేయాలని మావోయిస్టులు లేఖ రాశారు.మైనింగ్ ను నిలిపి వేయకపోతే స్థానిక ఎమ్మెల్యేకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.
పాడేరు: విశాఖపట్టణం జిల్లాలోని Paderu నియోజకవర్గంలో Bauxite మైనింగ్ నిలిపివేయకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని Maoist హెచ్చరించారు. ఈ మేరకు పాడేరు నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యే Bhagya Laxmiని ఉద్దేశించి మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. అయితే ఈ లేఖ విషయమై ఎమ్మెల్యే బాగ్యలక్ష్మి Police కు ఫిర్యాదు చేశారు. అయితే తన నియోజకవర్గంలో ఎలాంటి mining జరగడం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
విశాఖపట్టణంలో బాక్సైట్ మైనింగ్ కు Chandrababu ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అనుమతులను రద్దు చేసిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. తన నియోజకవర్గంలో లాటరైట్ మైనింగ్ జరుగుతున్న విషయం కూడా తనకు తెలియదన్నారు.బాక్సైట్ మైనింగ్ జరుగుతుందనే విషయాన్ని ఆమె కొట్టి పారేశారు. ప్రజా కోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు హెచ్చరించారు. గతంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోము హత్యలను కూడా మావోయిస్టు ఈస్ట్ జోన్ కమిటీ గుర్తు చేసింది. అయితే ఈ లేఖ నిజంగా మావోయిస్టులే రాశారా లేదా మావోయిస్టుల పేరుతో ఎవరైనా ఈ లేఖను సృష్టించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.
ఈ లేఖ వెలుగు చూడడంతో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సహా ఏజెన్సీలో పలువురు ప్రజా ప్రతినిధులకు పోలీసులు భద్రతను పెంచారు. మైనింగ్ చేయనందున రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు.