ఇద్దరు అక్కడిక్కడే చనిపోయారు

ఈ రోజు తెల్లవారుజామున విజయవాడ మొగల్రాజపురం పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకుల మృతి చెందారు. వారు వెేగంగా బైక్ నడిపుతూ రోడ్ డివైడర్ ను ఢికోట్టుకుంటూ వెళ్లారు. ప్రమాదంలో చనిపోయిన వారిలో ఒకరు హృతిక్ చౌదరిగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం వద్ద ఎటిఎం కార్డు ద్వారా గుర్తించారు.స్పోర్ట్స్ బైక్ ఆటోనగర్ కి చెందిన అమన్ అనే యువకుడిదిదని పోలీసులు చెబుతున్నారు. రాత్రి పార్టీ ఉందని తన స్నేహితులు బైక్ వేసుకెళ్ళారని అమన్ చెబుతున్నాడు. బైక్ దాదాపు 170 కి.మీ వేగంతో వెళ్లిందని పోలీసులు అనుమానం.

సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. యువకులు 390 సీసీ కలిగిన డ్యూక్‌ స్పోర్ట్స్‌ బైక్‌పై గంటకు 170 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయారని వారు చప్పారు. బైక్‌ డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో పెద్దఎత్తున మంటలు పుట్టాయని తర్వాత ముందున్న విద్యుత్‌ స్తంభాన్ని కూడా బలంగా ఢీకొట్టారని పోలీసులు చెప్పారు.దీనితో విద్యుద్యీపం కూడా ఆరిపోయింది. హృతిక్‌ చౌదరి కేఎల్‌ యూనివర్శిటీలో బీబీఏ కోర్సు చదువుతున్నాడు. రెండో యువకుడు యశ్వంత్‌గా పోలీసులు గుర్తించారు.