కరోనా పరీక్షలు చేసుకొంటేనే ఆర్జిత సేవలకు అనుమతి: టీటీడీ ఈఓ
ఆన్ లైన్ లో ముందస్తుగా బుక్ చేసుకొన్న వారికి మాత్రమే ఆర్జిత సేవలకు అనుమతిస్తామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. అయితే కరోనా పరీక్షలు చేయించుకొన్నట్టుగా సర్టిఫికెట్లు తప్పనిసరి అని ఆయన తేల్చి చెప్పారు.
తిరుపతి: ఆన్ లైన్ లో ముందస్తుగా బుక్ చేసుకొన్న వారికి మాత్రమే ఆర్జిత సేవలకు అనుమతిస్తామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. అయితే కరోనా పరీక్షలు చేయించుకొన్నట్టుగా సర్టిఫికెట్లు తప్పనిసరి అని ఆయన తేల్చి చెప్పారు.
శుక్రవారం నాడు డయల్ యువర్ ఈవో కార్యక్రమం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.ఆన్‌లైన్ లో ఆర్జిత సేవల టికెట్లు బుక్ చేసుకొన్నవారు తిరుమలకు రావడానికి 72 గంటల ముందు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు సర్టిఫికెట్ తేస్తేనే అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు.
also read:కరోనా దెబ్బ: తగ్గిన టీటీడీ ఆదాయం, పెరిగిన ఖర్చులు
అలిపిరిలో రెండు చోట్ల రెండు వేల వాహనాల చొప్పున పార్కింగ్ చేసుకొనే పార్కింగ్ సముదాయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించామన్నారు. టీటీడీ కళ్యాణ మండపాల లీజు కాలాన్ని 3 నుండి 5 ఏళ్లకు ఆ తర్వాత రెండేళ్ల పాటు పొడిగించేలా విధి విధానాలను సిద్దం చేస్తున్నట్టుగా ఆయన వివరించారు.
తిరుమల కొండపై విద్యుత్ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తుందని ఆయన చెప్పారు. ఫిబ్రవరి మాసంలో 14 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకొన్నారని ఆయన చెప్పారు.