అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి ఆధారాలు లేకుండా విభజించబడిందని ఆ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉందన్నారు. 

ప్రత్యేక హోదా అంశంపై 15వ ప్రణాళిక సంఘం ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తుందో వేచి చూడాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నది ఆ రాష్ట్రఆకాంక్ష అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా కోరుకోవడం వారి హక్కు అన్నారు. 

అయితే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే బీహార్, ఒడిస్సా రాష్ట్రాలు కూడా హోదా కోరుతున్నాయని తెలిపారు. అన్ని రాష్ట్రాల డిమాండ్ ను పరిగణలోకి తీసుకుని ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. 

ఇప్పటికీ వైయస్ జగన్ ప్రధాని నరేంద్రమోదీని కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికసాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు రామ్ మాధవ్. 
 

ఈ వార్తలు కూడా చదవండి

హోదావల్ల ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో నష్టపోతున్నాం: బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్