ఈ రోజు నుంచి అయిదు రోజుల పాటు 104వ భారత వైజ్ఞానిక సమావేశాలకు ఆతిథ్యమిస్తున్న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొవడం అవసరం.
గత సంవత్సరం, 2016, డి. 27 - 29 మధ్య భారత ఆర్థిక సంఘం (Indian Economic Association) 99 వ సమావేశం తిరుపతి, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయములొ విజయవంగముగా ముగిసినది. పూర్వపు విద్యార్థి గౌ. ముఖ్యమంత్రి చంద్రబాబుగారు స్వయాన పాల్గొని సమావేశాన్ని ఉద్ఘాటించారు. వారితొ సహ ఎందరో మహానుభావులు అక్కడ అభ్యసించారు. హాజరైన ప్రతినిధుల సంఖ్య దాదాపు, 1,500.
ఈ రోజు ( జనవరి 3, 2016) నుండి 7 వరకు ఐదు రోజున పాటు భారత వైజ్ఞానిక సంస్థ (Indian Science Congress) 104 వ సమావేశం మొదలయింది. సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదిగారు ప్రారంభోపన్యాసం ఇస్తున్నారు. దేశ విదేశాలలనుండి దాదాపు 3,000 ప్రతినిధులు హాజరుకావడం ఈ సమావేశము విశెషం. సత్పలితం కొరకు ముఖ్యమంత్రి స్వయాన రంగములోకి దూకి, మార్గ దర్శకత్వం చేస్తుండగా, యువ ఉపకులపతి ఆవుల దామోదరం గారి సారథ్యములొ విశ్వవిద్యాలయ సిబంది అహర్నిశలు శ్రమిస్తున్నది. దేశమంతా సత్పలితాన్ని ఎదురు చూస్తున్నది. ఆశిస్తున్నది.
ఒక చైనా సామెత: "పండు తింటూ, మొక్క నాటినవాడిని జ్ఞప్తికి తెచ్చుకోవాలది.” ఇంతటి గొప్ప సభలు, సమావేశాలకు ఆతిథ్యమిస్తున్న ఈ విశ్వవిద్యాలయం పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొవడం అవసరం.
గాంధీ మార్గములొ నడిచె ఆనాటి గొప్ప నాయకులందరికి, అణగ తొక్క బడిన, వంచనకు గురైన, బలహీనమైన, వర్గము, ప్రదేశం పై మమకారం ఉండింది. వాటి అభివృద్ధికి రవంత అవకాశం వచ్చినా ఎన్నడూ జారవిడచకుండా జాగ్రత్తగ వినియోగించుకొన్నారు. ఆ తరుణంములొ, ఆ నాటి నెల్లూరు జిల్లాలొని ఓంగోలు పట్టాణానికి సమేపలోని వినోదరాయునిపాళెంలొ జన్మించి, ఒంగోలు పట్టణములొ పెరిగి, రాజమహేంద్రవరములొ ఎదిగి, మద్రాస్ లొ స్థిర నివాసి యైన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశ్ం పంతులుగారు, ఆంధ్ర కేసరిగా 1946 లొ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రియైనారు.
వారు ఎన్నోప్రణాళికలు చేబట్టారు. వాటిని అమలుపర్చడానికి చర్యలు గైకొన్నారు. మంత్రివర్గములొ, వారి అనంగ శిష్యుడు కడప కోటి రెడ్డిగారు దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖామాత్యులు. వారి ద్వారా సంప్రదింపులు జరుపి తిరుమల తిరుపతి దెవస్థానం యాజమాన్యం, తిరుపతిలొ ఏడుకొండలవాడి పెరుతొ విశ్వవిద్యాలయం స్థాపించడానికి 2,000 ఎకరాల స్థలం, పది లక్షలు రూపాయిలు ఇవ్వడానికి ఒప్పించారు. అయితే, అనూహ్యమైన రాజకీయ పరిణామాలవల్ల ప్రకాశంగారి మంత్రివర్గం రాజీనామా చెయ్యవలసి వచ్చింది.
1953 లొ ప్రకాశంగారు ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కాగానే తన ధ్యేయాన్ని సాధించదలచుకొని ప్రతిపాదనలు తయారు చెసారు. తిరుమల తిరుపతి దేవస్థానమువారు పది లక్షల రూపాయిలు మరియు 2,000 ఎకరాల స్థలం, ప్రతి సంవత్సరం 2,50,000 రూపాయిలు విరాళం ఇవ్వడానికి అంగీకరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రిన్సిపాలైన ఆచార్య రంగనాథంగారిని, ప్రత్యేకాధిగారిగా నియమించి, ఒక నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
ఆ ప్రకారం, రంగనాథంగారు ఉపకులపతి వి.ఎస్.కృష్ణగారి మార్గదర్శనములొ నివేదికను అంద చేశారు. ఆ నివేదిక ఆధారముగా శ్రి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం బిల్లు నకలు సిద్ధమైనది. ఆ సంవత్సరం వేసవి కాలం శాసన సభా సమావేశం, వాల్టెరులొ, ఆంధ్ర విశ్వవిధ్యాలయం ప్రాంగణములొ నిర్వహించారు. మంత్రి వర్గములొ ఏడుగురిలొ నల్గురు ( నీలం సంజీవ రెడ్డిగారు, దామోదరం సంజేవయ్యగారు, కడప కోటి రెడ్డిగారు మరియు పెద్దరెడ్డి తిమ్మారెడ్డిగారు) రాయలసీమ వారు ఉన్నందున అడ్దంకులు లేకుండా, తే.12-5-54 న "శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ బిల్లు"ను శాసన సభలొ ప్రవెశ పెట్టారు.
ఆ బిల్లును 15-5-54 శాసన సభ పరిశీలనా సంఘా (Select Committee)నికి పంపారు. 26-5-54 న సంఘం నివేదిక రావడముతొ 31-5-54 న శాసన సభ ఆమోదం లభించడముతొ 1-6-54 గజెటు ప్రకటణతొ ముఖ్యమైన ఘట్టం/గండం దాటింది. గవర్నర్. త్రివేదిగారితొ ప్రకాశమ్ గారికి, సయోద్యం లేనందువల్ల, రాష్ట్ర ముఖ్యన్యాయాధీశులు, కోకా సుబ్బారావుగారిని కులపతిగా నియమించడానికి అనుకూలముగా చట్ట సభ తీర్మానించింది. సుబ్బారావుగారి మామ వెంకట రమణరావు నాయుడుగారు, జూనియర్ వకీలుగా ప్రకాశంగారి దగ్గర శిష్యరికం చేశారు. అందువల్ల సుబ్బారావుగారికి ప్రకాశంగారి పై పితృ వాత్సల్యం. ఇలా వెనుబడ్డ రాయలసీమావాసుల చిరకాల కోరికను నెరవెర్చి తన ఋణాన్ని ప్రకాశంగారు తీర్చుకొన్నారు; తనతనాన్ని నిలదొక్కుకొన్నారు.
విద్యాశాఖామాత్యులుగా ఉన్న పట్టాభిరామా రావుగారు బాధ్యాతాయుతమైన ఆసక్తి చూపక పోవడం భాదాకరమైన్ విషయం. ఇక రాష్ట్రపతి ఆమోదం కావాలి. ఈ విషయములొ కూడా పట్టాభివారు ధోరణి; అనాసక్తే. తెన్నెటివారికి ముప్పుతిప్పలు తప్పలేదు. వారు కెంద్ర గృహమంత్రి కాట్జుతొ సంప్రదించి రాష్ట్రపతి అమోదం నిమిత్తం దెహలి ప్రయాణమైనారు. దెహలిలొ కేంద్ర మంత్రిగా ఉన్న, వి.వి.గిరిగారి సహాకారముతొ, విద్యాశాఖామాత్యులు మౌలానా అబుల్ కలాం అజాద్ గారి కార్యదర్శి ఆచార్య హుమాయూన్ కబీర్ ని కలిసి చర్చించారు.
విధ్యా శాఖ కార్యదర్శి మరియు సలాహాదారులుగా ఉన్న గొప్పవిజ్ఞాని శాంతి స్వరూప్ భట్నగర్ గారిని ఒప్పించిన తరువాత దస్త్రాలు న్యాయశాఖకు పయణించాయి. అక్కడ మరల కార్యదర్శి గారి అడ్డంకులు: "తిరుమల తిరుపతి దేవస్థానం ఒక హిందూ సంస్థ. ఇది లౌకిక వ్యవస్థకు విరాళాలు ఇచ్చినయెడల హిందూ భక్తాదిలు అభ్యంతరం తెలిపితే, న్యాయాలయాలు దానిని ఆమోదించే అవకాశం ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా కాలంనుండి ఇలాంటి సంస్థలు నడుపుతున్నారు. రాజ్యాంగం అమలులొకి వచ్చి నాల్గు సంవత్సరాలు గడిచాయి. ఇంతవరకు ఏ మేధావికి ఇంతటి ఆలోచన రాలేదు" అంటె ఆ న్యాయ కోవిదునికి భోద పడలేదు.
అదృష్టవశాత్తు న్యాయశాఖామాత్యులు కలకత్తా ఉచ్ఛన్యాయాలయ విశ్రాంత న్యాయమూర్తి, చక్రవర్తిగారు తెన్నెటిగారి మిత్రులు. వారు కార్యదర్శిగారి నుండి దస్త్రాలు తీసుకొని కారు ఎక్కి విశ్వనాథంగారిని వెంటబెట్టుకొని పోతూ: "Vishwanatham, hose who come as secretaries to the Law Department, in spite of being lawyers at one time, soon get adjusted to the temperamental ways of the ruling class." అంటూ. కారులోనే, అనుమతి ఇవ్వవచ్చునని సంతకం చేశారు.
అక్కడినుండి దస్త్రాలు సానుకూలంగా పయణించి రాష్ట్రపతిగారి ఆమోదం పొంది, కర్నూలుకు చేరుకొంది. సెప్టెంబర్, 2, 1954 శుభ ముహూర్తాన ప్రకాశంగారు విశ్వవిద్యాలయాన్ని ఉద్ఘాటించారు. మద్రాస్ విద్యాశాఖ నిర్దేశకులుగా (Director, Public Instructions - DPI) ఉన్న ఆచార్య ఎస్.గోవిందరాజులు నాయుడుగారు మొదటి ఉపకులపతిగా నియమింపబడ్డారు.
పది సంవత్సరాల పాటు వారు సమర్థవంతముగా విధినిర్వహణ చేసి, ప్రకాశంగారి దృక్పతాన్ని సాక్షాత్కారం చెయ్యడములొ కృతకృత్యులయ్యారు. ”పొట్టివాడు గట్టివాడు’ ’పొట్టివాడికి పొట్టేడంత జిత్తులు’ అలాంటి సామేతలకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు. అప్పుటినుండి ఈ నాటి ఆవుల దామోదరం గారి వరకు మధ్యలొ 15 మంది దిగ్గజాలు ఉపకులపతి పదవిని అలంకరించారు. ఎవ్వరికి వారు తమవంతు విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేసి తమ ముద్ర వేశారు. విశ్వవిధ్యాలయం స్థాపించిన నాడు, చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు మరియు అనంతపురం జిల్లాలోని అన్ని కళాశాలలు,’ వైద్యకీయ, తాంత్రిక, వ్యవసాయ, పశువైద్య శాస్త్రం, కళాశాలలతొ సహ మొత్తం 20 మించలేదు. అనంతపురం కర్నూలు, కడప, కావలి నెల్లూరు మున్నగు ప్రదేశాలలొ స్నాతకోన్నతర కేంద్రాలు ఎర్పడి, తదుపరి అవన్ని విశ్వవిద్యాలయాలుగా పరిమళించాయి.
కర్ణాటక, తమిళునాడు,, ఇతర రాష్ట్రాలనుండి సమావేశాలకు హజరైన నా సహపాటి, సహచర మిత్రులు: "తిరుపతి, హైదరాబాద్, విశాఖపట్టణం లొ నిర్వహించినట్ళు సమావేశాలు ఎక్కడ జరుగలేదురా," అంటుంటారు. అంతటి గొప్ప ఆకర్షణ ఏమంటె, అంధ్ర వంటకాలు: "ఒర్రె, అవెన్ని రకలురా! పది పచ్చళ్ళు, అంతే పౌడర్లు, పప్పు, బొబ్బట్ళు, గారెలు, బూరెలు, భక్షాలు, ఇత్యాది. బ్రహ్మాండమురా" అంటూంటారు. అందుకె అల్లసాని వారి ఉద్భోద: "ఆత్మకింపైన భోజనం." అది లేనిదె నవరసభరితమైన సాహిత్యం రచన కుదరదు. వైజ్ఞానిక సదస్సు కూడా సాహిత్యముతొ మేళవించినదే కదా!
అన్నట్ళు, మాట వరుసకు కాకుండా, తీవ్రగతిలొ ఆలోచించవలసిన విషయం. మన దేశములొ దాదపు 5,000 రకాల సస్యాహారి వంటకాలు ఉన్నట్ళు పరిశోధకులు అభిప్రాయం. ఇవన్ని శాస్త్రీయమైనవి. దేశ, కాలాన్ని బట్టి, పండిన పంటలను ఉపయోగించుకొని మన పూర్వికులు, వంట, వార్పును ఆరోగ్యానికి అనుకూలంగా రూపొందించారు.
ఈ దృక్కొణముతో సమావేశం ఆహారం గురించి తర్జన భర్జన చెయ్యడం అవసరం. "లెక్కించడం ఎలాగో మాకు నెర్పించిన భారతీయులకు మేం ఎంతో ఋణ పడి ఉన్నాం. ఈ పరిజ్ఞానమే లేకపోతె చెప్పుకొదగిన ఒక్క వైజ్ఞానిక ఆవిష్కరణ కూడా సాధ్యమైయ్యెది కాదు." అన్నారు ప్రపంచ చరిత్రలొ మొదటి వరుసలొ స్థానం సంపాదించుకొన్న విజ్నాని అల్బర్ట్ ఐన్ స్టిన్.
ఈ సిద్దాంతాలను ఆచరణలోకి దించినప్పుడే విశ్వవిధ్యాలయం ధ్యేయం సార్థకం కాగలదు:జ్ఞానం సమ్యగ వీక్షణం. (Wisdom lies in proper perspective) శ్రీ వేంకటేశ్వరస్వామి సుప్రసన్నుడవుతాడు. న్యాయాలయాలు జోక్యం చేసుకోవు.
*కురాడి చంద్రశేఖర కల్కూర తెలుగునాట స్థిరపడిన కన్నడ పండితుడు. రాయలసీమలో తొలి నాటి ఉడిపి హోటళ్ల స్థాపనలో ఆయన కుటుంబం పాత్ర ఉంది.
