ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ : వేదిక మార్చుకోండి.. నిర్వాహకులకు పోలీసుల సూచన
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ ప్రాంతంలో బాలయ్య ఫ్యాన్స్ ఎక్కువగా వుంటారని అందువల్ల వేదిక మార్చుకోవాలని పోలీసులు సూచించారు.

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో ఎల్లుండి జరగాల్సి వున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేదికకు పోలీస్ శాఖ నుంచి అనుమతి లభించలేదు. ఒంగోలులో బాలకృష్ణ అభిమానుల తాకిడి ఎక్కువగా వుంటుందని అందువల్ల వేదిక మార్చుకోవాలని పోలీసులు నిర్వాహకులకు సూచించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒంగోలులో నిర్వహించడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని..నగరం బయట ఈవెంట్ నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ వేదిక చూస్తున్నారు వీరసింహారెడ్డి మూవీ మేకర్స్.