Asianet News TeluguAsianet News Telugu

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కరోనా: ఆసుపత్రిలో చికిత్స

ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కన్పించడంతో ఆయన పరీక్ష చేయించుకొన్నాడు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టుగా తేలింది.
 

ongole mp magunta srinivasulu Reddy tested corona positive lns
Author
Ongole, First Published Dec 20, 2020, 3:08 PM IST

ఒంగోలు: ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కన్పించడంతో ఆయన పరీక్ష చేయించుకొన్నాడు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టుగా తేలింది.

కరోనా నిర్ధారణ కావడంతో శ్రీనివాసులు రెడ్డి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనకు కరోనా నిర్ధారణ కావడంతో ఇటీవల కాలంలో తనను కలిసిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని  ఆయన కోరారు.

 ఎంపీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని... ఈ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని ఎంపీ సూచించారు.అపోలో ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఎంపీకి వైద్యులు చికిత్స అందిస్తున్నట్టుగా కుటుంబసభ్యులు చెప్పారు.

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి తగ్గుతున్నాయి. రాష్ట్రంలో పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా సోకి కోలుకొన్నారు. శనివారం నాటికి ఏపీలో కరోనా కేసుల సంఖ్య 8,78,285కి చేరుకొంది. రాష్ట్రంలో 4,355 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios