Asianet News Telugu

తూ.గో జిల్లాలో ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుండి గ్యాస్ లీకేజీ: భయాందోళనలో స్థానికులు

తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి లంకలో ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుండి శుక్రవారం నాడు గ్యాస్ లీకౌతోంది. దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పైప్‌లైన్ నుండి గ్యాస్ లీకౌతున్న విషయాన్ని స్థానికులు ఓఎన్‌జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ONGC gas pipeline leaks in Andhra Pradesh's East Godavari
Author
Amaravathi, First Published Jul 10, 2020, 10:44 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి లంకలో ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుండి శుక్రవారం నాడు గ్యాస్ లీకౌతోంది. దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పైప్‌లైన్ నుండి గ్యాస్ లీకౌతున్న విషయాన్ని స్థానికులు ఓఎన్‌జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఈ సమాచారం అందుకొన్న ఓఎన్‌జీసీ అధికారులు గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు.  గ్యాస్ లీకేజీ అవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో లైటర్లు, సెల్‌ఫోన్లు ఉపయోగించకూడదని అధికారులు ఆదేశించారు.

గతంలో కూడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుండి గ్యాస్ లీకైన ఘటనలు చోటు చేసుకొన్నాయి. కొన్ని సమయాల్లో పెద్ద ఎత్తున ప్రమాదాలు కూడ చోటుచేసుకొన్నాయి. 

ఈ ఏడాది మే 18వ తేదీన  ఓఎన్‌జీసీ పైప్ లైన్ నుండి గ్యాస్ లీకైంది. ఇదే జిల్లాలోని మలికిపురం మండలంలోని తూర్పుపాలెం గ్రామంలో గ్యాస్ లీకైంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఓఎన్‌జీసీ పైప్ లైన్ నుండి గ్యాస్ లీకైంది. సుమారు నెల రోజుల తర్వాత ఇదే జిల్లాలో మరోసారి పైప్ లైన్ నుండి గ్యాస్ లీకైంది.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios