విశాఖ కేజీహెచ్ వద్ద హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. కరోనాతో ఏడాదిన్నర పాప ప్రాణాలు కోల్పోయింది. అచ్యుతాపురంకు చెందిన ఈ పాపకు కరోనాగా తేలింది. మంగళవారం చిన్నారి పరిస్ధితి విషమంగా వుండటంతో తల్లిదంద్రులు కేజీహెచ్‌కు తరలించారు.

అయితే బెడ్స్ ఖాళీగా లేకపోవడంతో చేర్చుకోలేమని సిబ్బంది చెప్పారు. దీంతో పాపను గంట పాటు అంబులెన్స్‌లో వుంచి ఆక్సిజన్ అందజేశారు. అయితే సకాలంలో వైద్యం అందకపోవడంతో చిన్నారి అంబులెన్స్‌లో కన్నుమూసింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.