టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీడియో మార్ఫింగ్ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. తాను మాట్లాడిన వీడియోని మార్ఫింగ్ చేశారంటూ ఎమ్మెల్యే చింతమనేని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై స్పందించిన పోలీసులు.. కత్తుల రవి అనే యువకుడిని అరెస్టు చేశారు.

 చింతమనేని దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ ఘటనపై దళిత సంఘాలు నిరసనలు చేపట్టారు. అయితే తన వీడియోను మార్ఫింగ్ చేశారంటూ చింతమనేని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీడియోను పోస్టు చేసిన కత్తుల రవిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ వీడియోపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయగా.. టీడీపీ నేతలు మాత్రం.. అదంతా ఫేక్ అంటూ వాధించడం మొదలుపెట్టారు. మంత్రి లోకేష్ కూడా దీనిపై స్పందించారు.