అసెంబ్లీలో బూతులే వైసీపీని మట్టికరిపించాయా..?

టీడీపీ అభిమానులకైతే మనసులో నాటుకుపోయిన ఘటనిది. అదే వైసీపీ పాలిట పాశుపతాస్త్రమైందని చెప్పవచ్చు. 
 

One of the Reason behind YSRCP Defeat

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. వైసీపీని మట్టి కరిపించి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఎన్‌డీయే కూటమిలోని టీడీపీ అభ్యర్థులు అత్యధిక సీట్లను కొల్లగొట్టారు. ఈ నేపథ్యంలో గతంలో ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు చేసిన సవాల్‌ విస్తృతంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.  

''మళ్లీ చెప్తున్నా. ముఖ్యమంత్రిగానే ఈ హౌస్‌కు వస్తా తప్ప, అదర్‌వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇదో కౌరవ సభ. ఇది గౌరవ సభ కాదు ఇలాంటి కౌరవ సభలో నేనుండను. మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. నాకు జరిగిన అవమానాన్ని మీరందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారాలు’ అంటూ చంద్రబాబు అసెంబ్లీ నుంచి నిష్క్రమించారు. 2021 నవంబర్ 19న జరిగిన ఈ ఘటన చాలా మందికి గుర్తుండే ఉంటుంది. టీడీపీ అభిమానులకైతే మనసులో నాటుకుపోయిన ఘటనిది. అదే వైసీపీ పాలిట పాశుపతాస్త్రమైందని చెప్పవచ్చు. 

ఈ ఘటన జరిగి రోజు అన్ని మీడియా ఛానెళ్లు, సోషల్‌ మీడియాతో పాటు వాట్సాప్‌ గ్రూపుల్లో ఈ దృశ్యాలే కనిపించాయి. అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేసిన చంద్రబాబు ఆ తర్వాత తిరిగి అడుగుపెట్టలేదు. ఆపై ప్రెస్‌మీట్‌ మెట్టిన చంద్రబాబు.. అధికార వైసీపీ ఎమ్మెల్యేలు తనను, తన కుటుంబ సభ్యులను దూషించారంటూ వాపోయారు. తన భార్యను కూడా అనరాని మాటలన్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలను రాష్ట్రంలోని విపక్షాలు, ఎన్‌టీఆర్‌ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం నేతలు, శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయాక... ఆయన వెంటే వెళ్తూ తెలుగుదేశం పర్ఈ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు శాపనార్థాలు పెట్టారు. మీకు ఈ రోజే పతనం మొదలైందంటూ సభ నుంచి నిష్క్రమించారు. ఆ తర్వాత దాదాపు రెండున్నర సంవత్సరాలకు జరిగిన ఎన్నికల్లో అన్నట్లుగానే వైసీపీని టీడీపీ మట్టికరిపించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి హోదా అసెంబ్లీలో తిరిగి అడుగుపెట్టడమే మిగిలి ఉంది...

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios