కృష్ణాజిల్లాకి ఎన్టీఆర్ పేరు విషయంలో..జగన్ కి మరో షాక్: నటి తమన్నా మౌన పోరాటం

one more shock to jagan over NTR name to krishna district
Highlights

మౌన పోరాటం చేస్తున్న సినీ నటి తమన్నా

తాను అధికారంలోకి వస్తే.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానంటూ వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలు రోజుకో సంచలనానికి దారి తీస్తున్నాయి. జగన్ ప్రకటించిన నాటి నుంచి దానిపై ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. ఎవరో ఒకరు ఆ వ్యాఖ్యలను విభేదించడం సాధారణమైపోయింది. అయితే.. తాజాగా.. ఈ విషయంలో జగన్ కి మరో షాక్ తగిలింది. తెరపైకి వంగవీటి రంగా పేరు వచ్చి వచ్చింది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. జగన్ కృష్ణా జిల్లా కి ఎన్టీఆర్ పేరుపెడతాననడం.. చాలా మంది సొంత పార్టీ నేతల్లోనే చాలా మంది అభ్యంతరం తెలిపారు. కాగా.. సోమవారం జూనియర్ ఆర్టిస్టు తమన్నా.. విజయవాడలో మౌన పోరాటం చేపట్టారు. విజయవాడలోని వంగ వీటి రంగా విగ్రహం వద్ద ఆమె ఈ దీక్ష చేపట్టారు. కృష్ణా జిల్లాకి పెట్టాల్సింది ఎన్టీఆర్ పేరు కాదని.. వంగవీటి రంగా పేరని ఆమె అన్నారు. వంగ వీటి రంగా పేరు పెడతామని ప్రకటించే వరకు తాను దీక్ష చేస్తానని ఆమె డిమాండ్ చేశారు..

కాగా.. ఇప్పుడు జగన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారనే విషయం ఆసక్తిగా మారింది. కృష్ణా జిల్లా ప్రజల మనసు గెలుచుకునేందుకు ఆయన పాదయాత్రలో ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు. అదేమో ఇప్పుడు రివర్స్ అయ్యి కుర్చుంది. వంగవీటి రంగా కుమారుడు వంగ వీటి రాధా ప్రస్తుతం వైసీపీలోనే కొనసాగుతున్నారు. మరి తమన్నా పోరాటంపై జగన్ ఏమంటారో చూడాలి.

loader