కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీకి ఊహించని షాకిచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా ఇప్పుడు టీడీపీలో టికెట్ దక్కకపోవడంతో  జయరాములు.. టీడీపీకి వీడ్కోలు పలికారు.

 శనివారం మధ్యాహ్నం తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలు, కుటుంబీకులతో నిశితంగా చర్చించిన ఆయన టీడీపీకి రాజీనామా చేసేశారు. అనంతరం బీజేపీ కండువా కప్పుకున్నారు. బద్వేల్ బీజేపీ టికెట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా.. బద్వేల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్‌‌ను టీడీపీ ప్రకటించింది.