Asianet News TeluguAsianet News Telugu

ఏపీకి ముంచుకొస్తున్న మరో తుఫాను ముప్పు

ఈ ప్రభావం వల్ల రానున్న 36 గంటల్లో దక్షిణ కోస్తా ఆంధ్రలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందంటున్నారు. 

One More Cyclone Effect On Andhrapradesh
Author
Hyderabad, First Published Dec 1, 2020, 2:29 PM IST

నివర్ తుఫాను ప్రభావం ఏపీపై బాగా పడింది. ఈ తుఫాను కారణంగా చాలా మంది రైతుల తీవ్రంగా పంట నష్టపోయారు. కాగా.. ప్రభావం నుంచి రైతులు ఇంకా కోలుకోనేలేదు. ఆలోపే మరో తుఫాను ఏపీ వైపు ముంచుకొస్తోంది. 

ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడుతోంది. గడిచిన 3 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి శ్రీలంకలో ట్రింకోమలైకు తూర్పు ఆగ్నేయ దిశగా సుమారు 710 కిలోమీటర్లు కన్యాకుమారికి ఆగ్నేయ దిశగా సుమారు 1,120 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడుతోంది.. 24 గంటల్లో మరింత బలపడి తుఫాన్‌గా మారుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

ఈ తుఫాన్‌కు బురేవిగా తుఫాన్‌గా నామకరణం చేశారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ సుమారు డిసెంబర్‌ రెండు సాయంత్రం శ్రీలంక మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఇది దాదాపు పశ్చిమ దిశగా ప్రయాణించి ఆ తర్వాత డిసెంబర్‌ మూడు ఉదయానికి కోమారిన్‌ ప్రాంతంలోనికి ప్రవేశిస్తుంది. ఈ ప్రభావం వల్ల రానున్న 36 గంటల్లో దక్షిణ కోస్తా ఆంధ్రలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందంటున్నారు. 

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios