కడప జిల్లా సిద్ధవటం మండలం ఉప్పరపల్లె శివారులో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కార్పియో-లారీ ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో స్కార్పియో డ్రైవర్ ఆది సజీవదహనమయ్యాడు. కాగా... పలువురికి గాయాలయ్యాయి.

Also Read చిన కాకానిలో వ్యభిచారం.. గుట్టురట్టు చేసిన పోలీసులు...

బాధితులు కర్నూలు జిల్లా బాలంపురం నుంచి స్పార్పియోలో తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను 108 వాహనంలో కడప సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను సుల్తాన్(28), హరినాథ్ రెడ్డి(36), నందకిశోర్ రెడ్డి(6), పార్వతి(30), శంకర్ నారాయణ రెడ్డి(55), జయమ్మ(55), కృష్ణ కిశోర్ రెడ్డి(29) గా గుర్తించారు. వీరితోపాటు మరో బాలిక సైతం తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.