గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని చినకాకానిలో గత కొంతకాలంగా జరుగుతున్న వ్యభిచార గుట్టుని పోలీసులు రట్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చినకాకాని గ్రామ పంచాయతీ పరిధిలోని రాజ్ కమల్ రోడ్డులో ఇద్దరు మహిళలు కొంతకాలంగా ఓ ఇల్లు అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

Also Read చనిపోయిన భర్త ఆత్మ గా ఇంట్లో తిరుగుతున్నాడని నమ్మించి.....

ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి వ్యభిచారం నడుపుతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో మంగళగిరి రూరల్ సీఐ శేషగిరిరావు, ఎస్ఐ శ్రీనివాస రెడ్డి తన సిబ్బందితో ఆ ఇంటిపై మెరుపుదాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలతోపాటు ఓ విఠుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద రూ.4వేల నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా... వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలను ఇంటికి రప్పించి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.