Asianet News TeluguAsianet News Telugu

తిరుమలలో మరోసారి అపచారం.. ఆలయం పైనుంచి వెళ్లిన విమానం..

తిరుమల కొండపై మరోసారి అపచారం జరిగింది. తిరుమల పైనుంచి మరోసారి విమానం వెళ్లింది.

Once again aircraft flying over Tirumala temple ksm
Author
First Published Sep 7, 2023, 11:55 AM IST

తిరుమల కొండపై మరోసారి అపచారం జరిగింది. తిరుమల పైనుంచి మరోసారి విమానం వెళ్లింది. ఆలయం పై నుంచి మహాగోపురం మీదుగా విమానం వెళ్లినట్టుగా భక్తులు చెబుతున్నారు.  ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల పైనుంచి విమానాలు వెళ్లకూడదనే వాదన ఉంది. తిరుమలను నో ఫ్లైయింగ్‌ జోన్ పరిధిలోకి తేవాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా తిరుమల కొండపై తరుచుగా విమానాలు వెళ్తున్నాయి. 

అయితే ఈ నేపథ్యంలోనే తిరుమల కొండ గగనతలంపై నుంచి విమానాలు వెళ్లడం ఆగమశాస్త్ర నిబంధనలకు వ్యతిరేకమని టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయితే టీటీడీ  అభ్యంతరాలను విమానయాన శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios