Asianet News TeluguAsianet News Telugu

Omicron Fear in AP : ఒమిక్రాన్ టెన్ష‌న్..! విదేశాల నుండి ఏపీకి 12,500 మంది.. చాలా మంది ఫోన్స్ స్విచ్ ఆఫ్

ఏపీలో ఒమిక్రాన్ వేరియంట్ భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. దాదాపు ప‌దిరోజుల వ్య‌వ‌ధిలోనే 12,500 మందికి పైగా.. విదేశాల‌ను నుంచి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇందులో అత్య‌ధికంగా.. విశాఖ జిల్లాకు చెందిన వారే 1700 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర‌ప్ర‌భుత్వం అప్ర‌మత్త‌మైంది.
 

omicron fear for ap 12,500 people from abroad in just 10 days new trouble to officials
Author
Hyderabad, First Published Dec 10, 2021, 1:13 PM IST

Omicron Fear in AP : ప్ర‌పంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. కేవలం ద‌క్షిణాఫ్రికాలో బ‌య‌ట‌ప‌డిన రెండు వారాల వ్య‌వ‌ధిలోనే 57 దేశాల‌కు వ్యాపించింది. దీంతో ప్ర‌పంచ ప్రజానీకం భయాందోళ‌నల‌కు గురవుతోంది. అలాగే.. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్ష‌న్ ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తుంది.  ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో దేశంలో మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగబోతున్న‌ట్టు  ఆరోగ్య నిపుణులు.. శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. ప్ర‌స్తుతం క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతోన్నా.. ఫిబ్ర‌వ‌రి, మార్చి క‌ల్లా.. పీక్స్ కు చేర‌బోతుందని తెలిపారు. దీంతో  స‌ర్వ‌త్రా టెన్ష‌న్ మొద‌లైంది.
 
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఒమిక్రాన్ భయం పట్టుకుంది. శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదు అయిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో ..గత అనుభవాల దృష్ట్యా పెట్టుకుని  రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించవారికి రూ. 1000 జరిమానా విధించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మాస్కులేని వారిని దుకాణాల్లో, వాణిజ్య ప్రదేశాల్లో, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే సదరు యాజమాన్యానికి రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఫైన్ విధించాల‌ని నిర్ణ‌యించింది. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. ఆయా వ్యాపార, వాణిజ్య సంస్థలను 2 రోజుల పాటు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలా అనేక క‌ఠిన నిబంధ‌న‌లు తీసువ‌చ్చింది. అలాగే విదేశాల నుండి ఏపీకి వచ్చే వారికి  ఎయిర్ పోర్టుల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

Read Also: https://telugu.asianetnews.com/national/coronavirus-live-updates-r3vzei

కానీ, ఈ నిబంధ‌న‌లు అమ‌లు రాక ముందే.. గ‌త వారం రోజు క్రితం నుంచి వేలాది మంది విదేశీ  ప్ర‌యాణీలు రాష్ట్రంలోకి ప్ర‌వేశించిన‌ట్టు తెలుస్తోంది. గ‌త వారం , ప‌ది రోజుల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నెండు వేల ఐదు వందల మంది వ‌చ్చిన‌ట్టు రిపోర్టు. ఇందులో అత్యధికంగా విశాఖ జిల్లాకు 1700 మంది విదేశాల నుండి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఒమిక్రాన్ భ‌యం మ‌రింత పెరిగింది. తాజాగా డిసెంబర్ 1 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఏపీకి 12,500 మంది రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక విదేశాలనుండి అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన వారిలో ఎక్కువమంది వైజాగ్ నుండి ఉండటం ప్రధానంగా కనిపిస్తుంది. 

దీంతో వారిని గుర్తించే ప‌నిలో ప‌డ్డారు అధికారులు. ఇప్ప‌టికి వ‌ర‌కూ  తొమ్మిది వేల మంది అడ్రస్ ను అధికారులు సేకరించారు. మిగతా వారి కోసం సంప్రదించగా వారి నుండి ఎలాంటి స్పందన రావడం లేదని, వారి ఫోనులు స్విచ్ ఆఫ్ ఉన్నాయని తెలుస్తోంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొద‌లైంది.
మ‌రో వైపు.. విదేశాల నుంచి వ‌చ్చిన ప్ర‌యాణీకుల్లో తొమ్మిది వేల మందిలో ప‌రీక్షించ‌గా.. ఇద్దరికి కరోనా పాజిటివ్ అని నిర్ణార‌ణ‌కు పంపించారు. దీంతో వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. విదేశాల నుండి ఏపీకి వచ్చిన వారు స్వచ్ఛందంగా వచ్చి కరోనా పరీక్షలు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Read Also: https://telugu.asianetnews.com/national/bodies-of-cds-bipin-rawat-wife-and-others-reach-delhi-pm-narendra-modi-to-pay-tribute-r3uv01

ఇదిలా ఉంటే.. ఒమిక్రాన్ కేసులు తొలిసారిగా నమోదైన దక్షిణాఫ్రికాలో క‌రోనా నాల్గవ వేవ్ విజృంభిస్తుంది. ఇక ఇతర చాలా దేశాలు సైతం ఒమిక్రాన్ వేరియంట్ భయానికి అంతర్జాతీయ విమానాల పై నిషేధం విధిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios