Asianet News TeluguAsianet News Telugu

మానవత్వం మంట కలిసిన వేళ: మహిళను చెట్టు కింద వదిలేసిన కుటుంబ సభ్యులు

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ మానవత్వం మంట గలిసిన సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా  ఓ వృద్ధురాలిని కుటుంబ సభ్యులు చెట్టు కింద వదిలేసి వెళ్లిపోయారు.

Old woman left undr a tree at Marteru
Author
Maruteru, First Published May 7, 2021, 8:03 AM IST

మార్టేరు: కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ అమానుష సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కరోనా వ్యాధి సోకిందనే కారణంతో ఓ వృద్ధురాలిని కుటుంబ సభ్యులు వదిలేశారు. మార్టేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలోని ఓ చెట్టు కింద ఆమెను కుటుంబ సభ్యులు వదిలేసి వెళ్లిపోయారు. 

ఆస్పత్రి ప్రాంగణంలో చెట్టు కింద ఉన్న వృద్ధురాలిని వైద్యులు గానీ వైద్య సిబ్బంది గానీ పట్టించుకోలేదు. దీంతో ప్రాణపాయ స్థితిలో చెట్టు కిందనే ఆ మహిళ కొట్టుమిట్టాడుతోంది.

ఇదిలావుంటే, గురువారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.... ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే వుంది. పగటి పూట కర్ఫ్యూతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా దేశంలో కోవిడ్ తీవ్రత అధికంగా వున్న రాష్ట్రాల లిస్ట్‌లోకి ఏపీ వెళ్లిపోయింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 21,954 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 12,28,186కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 72 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 8,446కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విశాఖపట్నం 11, విజయనగరం 9, అనంతపురం 8, తూర్పుగోదావరి 9, ప్రకాశం 6, పశ్చిమ గోదావరి 5, చిత్తూరు 5, గుంటూరు 5, కర్నూలు 4, నెల్లూరు 2, కృష్ణ 4, శ్రీకాకుళం నలుగురు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 10,141 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 1037,411కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,10,147 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,70,60,446కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,82,329 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 1871, చిత్తూరు 2354, తూర్పుగోదావరి 3531, గుంటూరు 1348, కడప 1130, కృష్ణ 548, కర్నూలు 1920, నెల్లూరు 1292, ప్రకాశం 1666, శ్రీకాకుళం 1939, విశాఖపట్నం 2107, విజయనగరం 1160, పశ్చిమ గోదావరిలలో 1088 మంది చొప్పున వైరస్ సోకింది. 

Follow Us:
Download App:
  • android
  • ios