Asianet News TeluguAsianet News Telugu

అప్పు తీసుకుని ఒకరు, చేతబడి పేరుతో మరొకరు... వృద్ధుడి గొంతుకోసి దారుణంగా చంపేశారు..

పంగూరు  గిరిజన కాలనీకి చెందిన మస్తానయ్య కుమారుడు పూజారి వెంకటేష్ ఈ ఏడాది ఆరంభంలో  తన చెల్లి పెళ్లి నిమిత్తం  నారాయణ వద్ద రూ. యాభై వేలు అప్పుగా తీసుకున్నాడు.  మూడు నెలలు తర్వాత సొమ్ము అడిగిన నారాయణతో వెంకటేష్ గొడవకు దిగాడు.  ఆ తర్వాత నాగరాజు వద్ద రూ. 50 వేలు తీసుకుని అప్పు చెల్లించాడు. అయితే అప్పు చెల్లించమని  నలుగురి ఎదుట  ఒత్తిడి పెట్టిన  నారాయణపై  కసి పెంచుకున్నాడు.

Old man brutally murdered in tirupati, in the name of witchcraft
Author
Hyderabad, First Published Nov 30, 2021, 9:58 AM IST

చిత్తూరు : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తీర్చమన్నాడని ఓ వృద్ధుడిని దారుణంగా murder చేశాడో వ్యక్తి. తీసుకున్న అప్పు తీర్చమని నలుగురిలో అడగడమే ఆ వృద్ధుడు చేసిన తప్పు. దీంతో అతని మీద ఓ వ్యక్తి కసి పెంచుకున్నాడు. దీనికి అప్పటికే ఆ వృద్ధుడు Witchcraft చేశాడని ఆయనపై కక్ష పెంచుకున్న మరొకరు తోడయ్యారు.

ఈ ఇరువర్గాల టార్గెట్ ఒక్కడే కావడంతో వీరిద్దరూ చేతులు కలిపారు. ఈ నెల 25న అర్థరాత్రి ఏర్పేడు మండలం పంగూరు గిరిజన కాలనీకి చెందిక కుంభ నారాయణ (59)ని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి police ఆరుగురు నిందితులను arrest చేశారు. 

వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని పంగూరు గిరిజన కాలనీకి చెందిన నారాయణ వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాడు. ఆయన ఇంటిపక్కనే నివసిస్తున్న వరుసకు మేనల్లుడైన పూజారి నాగరాజు (56) తరచూ healt problemsకి గురవుతున్నాడు. కుటుంబంలో Financial difficulties మొదలయ్యాయి. నారాయణ చేతబడి చేయడంతో సమస్యలు వస్తున్నట్లు అనుమానించారు. ఈ విషయమై తరచూ రెండు కుటుంబాల మధ్య గొడవ జరుగుతుండేది. 

kurnool RTC Bus accident: కర్నూలు జిల్లాలో లోయలోపడ్డ ఆర్టీసీ బస్సు.. నలుగురి పరిస్థితి విషమం..

ఈ నెల 20న స్థానిక కుల పెద్దలు నాగరాజు కుటుంబంపై చేతబడి చేయలేదని బుచ్చినాయుడు కండ్రిగ మండలం పచ్చాలమ్మ కాలనీలోని పచ్చాలమ్మ ఆలయంలో నారాయణ oath చేయాలని తీర్మానించారు.  దీంతో వచ్చే నెల 6న ప్రమాణం చేసేందుకు సిద్ధమని నారాయణ తేల్చి చెప్పాడు.

అప్పు తీర్చాలి అని  అవమానించడంతో…
పంగూరు  గిరిజన కాలనీకి చెందిన మస్తానయ్య కుమారుడు పూజారి వెంకటేష్ ఈ ఏడాది ఆరంభంలో  తన చెల్లి పెళ్లి నిమిత్తం  నారాయణ వద్ద రూ. యాభై వేలు అప్పుగా తీసుకున్నాడు.  మూడు నెలలు తర్వాత సొమ్ము అడిగిన నారాయణతో వెంకటేష్ గొడవకు దిగాడు.  ఆ తర్వాత నాగరాజు వద్ద రూ. 50 వేలు తీసుకుని అప్పు చెల్లించాడు. అయితే అప్పు చెల్లించమని  నలుగురి ఎదుట  ఒత్తిడి పెట్టిన  నారాయణపై  కసి పెంచుకున్నాడు.

ఆ తర్వాత  నాగరాజు తో చేతులు కలిపి  నారాయణని చంపాలని  పథకం పన్నాడు. ఈ మేరకు.. ఈ నెల 25న అర్ధరాత్రి దాటాక నాగరాజు ఆయన పెద్ద కుమారుడు పూజారి వెంకటేష్ (31),  చిన్న కుమారుడు  పూజారి సతీష్ ( 26),  మస్తానయ్య కుమారుడు పూజారి వెంకటేష్ (23),  ఆయన అల్లుడు తిరుపతి  లక్ష్మీ పురానికి చెందిన అబ్బాస్ (35),  సమీప బంధువు పూజారి రాజశేఖర్ అలియాస్ రాజు (24)  ఇంటి పక్కన ఉన్న చర్చిలో నిద్రిస్తున్న నారాయణ వద్దకు వెళ్లారు.

తర్వాత చర్చి బయట నాగరాజు కాపలా ఉండగా.. మిగిలిన నలుగురు ఆయననీ కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. దీంతో మస్తానయ్య కుమారుడు వెంకటేష్ తన వెంట తెచ్చుకున్న కత్తితో నారాయణ గొంతు కోసి దారుణంగా చంపేశాడు. మృతుడి భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని శ్రీకాళహస్తి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ శ్రీహరి పేర్కొన్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆరుగురిని రిమాండ్ నిమిత్తం స్థానిక సబ్ జైలుకు తరలించినట్లు వివరించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios