Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో వృద్ధుడి హత్య.. తల, మొండెం వేరుచేసి దారుణం.. (వీడియో)

మృతుడు గతంలో లారీ డ్రైవర్ గా పనిచేసి మధ్యానికి బానిసై ఇంటివద్దే ఖాళీగా ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. కాగా అపార్ట్ మెంట్ పై అంతస్తులు ప్లాస్టిక్‌ తాడు కట్టి ఉండటం దాని సమీపంలోనే మృతుడు తల, మొండెం వేరు వేరుగా పడటంతో స్థానికులు భవానిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Old man brutally killed in Vijayawada
Author
Hyderabad, First Published Nov 30, 2021, 11:38 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ : Vijayawada నగర శివారు గొల్లపూడి గ్రామంలో ఓ అపార్ట్ మెంట్ ప్రాంగణంలో వేరుగా పడి ఉన్న వృద్ధుడి Corpse కలకలం రేపింది. మృతుడు అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న సుబ్బారావు (59)గా స్థానికులు గుర్తించారు.

"

మృతుడు Lorry driver‌గా గతంలో పనిచేసి మధ్యానికి బానిసై ఇంటివద్దే ఖాళీగా ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. కాగా అపార్ట్ మెంట్ పై అంతస్తులు ప్లాస్టిక్‌ తాడు కట్టి ఉండటం దాని సమీపంలోనే మృతుడు తల, మొండెం వేరు వేరుగా పడటంతో స్థానికులు భవానిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్దుడిది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, విజయవాడ లో మరో దారుణం చోటు చేసుకుంది. కాల్ మనీ వేధింపులు తట్టుకోలేక ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన VRO gouse ఆత్మహత్య చేసుకున్నాడు. గౌస్ ప్రస్తుతం కొండపల్లి గ్రామ విఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం గౌస్ కొంత అప్పు చేశాడు. 

నెల నెలా వడ్డీ డబ్బులు సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ లక్షల్లో అప్పులు ఉన్నట్టు కాల్ మని మాఫియా సృష్టించింది. దీంతోపాటు ఆ డబ్బు చెల్లించాలంటూ వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది. దీంతో ఈ చిత్రహింసలు తాళలేక సూసైడ్ లెటర్ వ్రాసి కొండపల్లిలోని అద్దె ఇంట్లో ఫ్యాన్ కు ఉరి పెట్టుకొని suicide చేసుకున్నాడు.

విషయం తెలిసిన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గతంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన గౌస్ బలవన్మరణానికి పాల్పడటం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios