అనంతపురం: మనవరాలి వయసుండే ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో వృద్ధుడు. ఒంటరిగా వున్న సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి ప్రవేశించిన వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. 

వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లాలోని కదిరి మండలకేంద్రంలో రామకృష్ణ అనే వృద్ధుడు నివాసముంటున్నాడు. కుటుంబసభ్యులు పనుల నిమిత్తం బయటకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా వుండేవాడు. అయితే రామకృష్ణ ఇంటికి సమీపంలో ఓ కుటుంబం నివాసముంటోంది. తల్లిదండ్రులు పనుల నిమిత్తం వెళ్లగా మైనర్ బాలిక ఇంట్లోనే ఒంటరిగా వుంటోంది. అభం శుభం తెలియని ఈ బాలికపై రామకృష్ణ కన్నేశాడు. 

read more   విశాఖ జిల్లాలో ఆరుగురి హత్య: అక్రమ సంబంధమే కారణం, తప్పించుకున్న విజయ్

ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం అఘాయిత్యానికి పాల్పడిన వృద్ధున్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ నిందితున్ని కఠినంగా శిక్షించాలని కదిరి ప్రజలు కోరుతున్నారు.