శాస్త్ర విజ్ఞానం రోజురోజుకు పురోగతి చెందుతున్న ..ఇంకా కొన్ని మూఢనమ్మకాలు మాత్రం ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా కైకలూరులో క్షుద్ర పూజల కలకలం చేలారేగింది.
శాస్త్ర విజ్ఞానం రోజురోజుకు పురోగతి చెందుతూ.. ప్రపంచం దూసుకుపోతోంది. కంపూటర్లు, ఇంటర్ నెట్‌లు, రాకెట్‌లు, సాటిలైట్‌లు, సెల్‌ఫోన్లు వంటి అత్యాధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాం. అయినా.. ఇంకా కొన్ని మూఢనమ్మకాలు మాత్రం ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ శాస్త్ర విజ్ఞాన కాలంలో కూడా దెయ్యాలు, భూతాలు అంటూ కొందరు అంద విశ్వాసంలో మునిగి తేలుతున్నారు. క్షుద్ర పూజల పేరుతో సామాన్యులను భయభంత్రులకు గురిచేస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. ఏలూరు జిల్లా కైకలూరులో క్షుద్ర పూజల కలకలం రేపింది. క్షుద్రపూజల ఆనవాళ్లు స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
వివరాలు ఇలా ఉన్నాయి.. కైకలూరు మండలం వేమవరం పాడు గ్రామంలో శనివారం రాత్రి క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి .. చెరువు వద్ద క్షుద్ర పూజలు చేస్తున్నాడనే అనుమానంతో స్థానికులు అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో గొడవ పెద్దది అయింది. తాను చెరువుకు పూజలు చేస్తున్నాననీ, క్షుద్ర పూజలు చేయడం లేదని చెప్పిన సదరు వ్యక్తిని గ్రామస్థులు చితకబదారు. విషయంలో పోలీసులకు చేరడంతో వివాదం కాస్తా.. పోలీస్ స్టేషన్ కు చేరింది. పూజలు నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అలాగే.. ఎటువంటి గొడవలు జరగకుండా.. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామి ఇచ్చారు. అదుపులోకి తీసుకుని వ్యక్తిని విచారిస్తున్నారు. అమావాస్య, పౌర్ణమి వచ్చిందంటే.. ఇలాంటి క్షుద్ర పూజలు అనేకం వెలుగులోకి వస్తున్నాయనీ, పలువురి ఇళ్ల ముందే పూజలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. క్షుద్రపూజలపై ఎవరూ భయపడవద్దని జన విజ్ఞాన వేదిక సూచిస్తుంది. అమాయక ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరూ ఇలాంటి చర్యలను పాల్పడుతున్నారని పేర్కొంది.
