సాంప్రదాయబద్దంగా జరుపుకోవాల్సిన పెళ్లిరోజు వేడుకలను అశ్లీల నృత్యాలతో జరుపుకున్నాడు ఓ మాజీ సర్పంచ్. అయితే ఈ అశ్లీల నృత్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మాజీ సర్పంచ్ పై కేసు నమోదు చేశారు. ఇలా ఆనందాన్ని ఇవ్వాల్సిన పెళ్లిరోజు వేడుకలు అతడిని ఇబ్బందులపాలు చేశాయి.  

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొడేరు మండలం పెన్నడపాలెంలో శుభకార్యంలో అశ్లీల నృత్యాలు ఏర్పాటుచేశారు. తన పెళ్లి రోజున గ్రామ మాజీ సర్పంచ్ చేబ్రోలు రామకృష్ణ ఇతర ప్రాంతాల నుండి యువతులను రప్పించి అశ్లీల నృత్యాలతో కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో యువతులతో కలిసి సదరు ఉపసర్పంచ్ చిందులేశారు. 

వీడియో

అయితే ఈ అశ్లీల నృత్యాలకు సంబంధించిన వీడియో ఆలస్యంగా బయటకు వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో పాలకోడేరు పోలీసులు రామకృష్ణతో సహా మరో నలుగురిపై కేసు నమోదు చేశారు.