నల్గొండ జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మాజీ మంత్రి, సినీ నటుడు నందమూరి హరికృష్ణ అస్థికలను కృష్ణా నదిలో కలిపారు.  ఆయన కుమారులు,  సినీ హీరోలు కళ్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ మంగళవారం కృష్ణా నదిలో హరికృష్ణ అస్థికల నిమజ్జనం చేశారు. 

పవిత్ర పుణ్యక్షేత్రమైన బీచుపల్లి సన్నిధికి సోమవారం ఉదయం 6గంటలకు చేరుకొని వేదమంత్రోచ్చారణల మధ్య తమ తండ్రి అస్థికలను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. కాగా... అభిమానులు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లను చూసేందుకు ప్రయత్నించినా భద్రతా సిబ్బంది దగ్గరకు రానివ్వక పోవడంతో వెనుదిరిగి వెళ్లారు.

read more news

హైదరాబాద్ జలవిహార్ లో.. హరికృష్ణ దశదిన కర్మ

హరికృష్ణ విషాదం జరగకుండా ఉంటే...